క‌ళాశాల‌ భ‌వ‌నంపై నుంచి విద్యార్థినిని తోసేశారు.. వీడియో

Fri,July 13, 2018 09:41 AM

BBA student died fall from college building in TamilNadu

తమిళనాడు: కోయంబత్తూరులో కళాశాల భవనం పైనుంచి పడి విద్యార్థి మృతి చెందింది. భవనం మూడో అంతస్తు నుంచి పడటంతో లోకేశ్వరి అక్కడికక్కడే మృతి చెందింది. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ శిక్షణ ఇస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. కోవై కళైమగల్ కళాశాలలో లోకేశ్వరి బీబీఏ రెండో సంవత్సరం చదువుతోంది.

సంఘటన వివరాల్లోకి వెళితే మాక్ డ్రిల్‌లో మొత్తం 22 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఆఖరుగా దూకిన లోకేశ్వరి 22వ విద్యార్థి. తలకు, మెడకు బలమైన గాయాలు కావడంతో ఆమె మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఏఐడీఎంకే నాయకుడు లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ మునుస్వామి తంబిదురికి చెందిన స్వంత కాలేజీ. తంబిదురి ఎడ్యుకేషనల్ ట్రస్ట్‌కు మునుస్వామి భార్య చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రకృతి విపత్తుల నిర్వహణ ట్రైనర్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. విద్యార్థినిని ట్రైనర్ బలవంతంగా తోయడంతో ఈ ప్రమాదం జరిగిందని తోటి విద్యార్థులు ఆరోపిస్తున్నారు.

2162
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles