అవన్నీ తప్పుడు ఆరోపణలు.. అన్యాయంగా పాస్‌పోర్ట్ రద్దు చేశారు!

Tue,September 11, 2018 04:08 PM

Baseless and false charges against me says Mehul Choksi

న్యూఢిల్లీ: పంజాబ్ నేషనల్ బ్యాంక్ స్కాంలో నిందితుల్లో ఒకరైన మెహుల్ చోక్సీ కరీబియన్ దేశమైన ఆంటిగ్వాలో తలదాచుకుంటున్న విషయం తెలిసిందే. దేశం వదిలి పారిపోయిన తర్వాత తొలిసారి అతడు ఓ వీడియో ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తనపై అన్నీ నిరాధార, తప్పుడు ఆరోపణలు చేసిందని, అన్యాయంగా తన ఆస్తులను అటాచ్ చేశారని ఆరోపించాడు. తన పాస్ట్‌పోర్ట్‌ను కూడా రద్దు చేస్తున్నట్లు ఈ ఏడాది ఫిబ్రవరి 16న ఓ మెయిల్ వచ్చిందని, దీనిపై వివరణ ఇవ్వాల్సిందిగా తాను పాస్‌పోర్ట్ కార్యాలయానికి మెయిల్ కూడా చేశానని అతడు చెప్పాడు. పాస్‌పోర్ట్ ఎలాగూ రద్దు చేశారు కాబట్టి.. ఇక దానిని సరెండర్ చేసే అవకాశమే లేదని చోక్సీ తెలిపాడు. సుమారు రూ.13 వేల కోట్ల విలువైన పంజాబ్ నేషనల్ బ్యాంక్ స్కాంకు సంబంధించి చోక్సీపై రెడ్‌కార్నర్ నోటీస్ జారీ చేయాల్సిందిగా ఈడీ.. ఇంటర్‌పోల్‌కు లేఖ రాసిన మరుసటి రోజే ఈ వీడియో బయటకు రావడం విశేషం. ఇక స్వదేశానికి తిరిగి రావడానికి విజయ్ మాల్యాలాగే చోక్సీ కూడా ఇక్కడి జైళ్లలోని పరిస్థితులు, తన భద్రత, ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తంచేసిన విషయం తెలిసిందే. గతేడాది ఆంటిగ్వా పౌరసత్వాన్ని చోక్సీ తీసుకున్నాడు.
1497
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles