బ్యాంకులకు సెలవుల వదంతులపై ఆర్థిక శాఖ స్పందన

Fri,August 31, 2018 12:26 PM

Banks to remain open in first week of September says Ministry of Finance

న్యూఢిల్లీ : సెప్టెంబర్ తొలివారంలో బ్యాంకులకు వరుసగా సెలవులు వస్తున్నాయని సామాజిక మాధ్యమాల్లో వదంతులు వస్తున్న నేపథ్యంలో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పందించింది. కేవలం రెండో శనివారం, ఆదివారం మాత్రమే సెలవులు ఉన్నాయని ప్రకటించింది. మిగిలిన అన్ని రోజులు బ్యాంకుల కార్యకలాపాలు కొనసాగుతాయని స్పష్టం చేసింది. అన్ని రాష్ర్టాల్లో అన్ని ఏటీఎంలలో విరివిగా డబ్బు నిల్వలు ఉన్నట్లు తెలిపింది. నగదు నిల్వలు లేని పక్షంలో చర్యలు తీసుకోవాలని బ్యాంకులకు ఆర్థిక శాఖ ఆదేశాలు జారీ చేసింది.

1612
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles