కస్టడీ నుంచి పారిపోయిన బంగ్లాదేశ్ జాతీయుడు

Wed,June 13, 2018 04:42 PM

Bangladesh national escapes from Padav Police Station

మధ్యప్రదేశ్: పోలీస్ కస్టడీ నుంచి బంగ్లాదేశ్ జాతీయుడు పారిపోయాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. గ్వాలియర్‌లోని గాంధీనగర్ పడావ్ పోలీస్‌స్టేషన్ నుంచి ఇతడు తప్పించుకు పారిపోయాడు. భారత్ భూ భాగంలోకి అక్రమంగా ప్రవేశించిన కారణంగా బంగ్లాదేశ్ జాతీయుడు మూడేళ్లు పోలీస్ కస్టడీలో ఉన్నాడు. ఇండియా వదిలి వెళ్లేందుకు అతడికి ఇంకా అనుమతి లభించలేదు. అయినప్పటికీ అతడు పోలీస్ కస్టడీ నుంచి తప్పించుకు పారిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి గాలింపు చర్యలు చేపట్టారు.

532
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS