37 పళ్లతో గిన్నిస్ రికార్డుకెక్కాడు.. ఫోటోలు

Sat,September 22, 2018 07:25 PM

Bangalore man achieved Guinness World Record by having 37 teeth in his mouth

సాధారణంగా మనిషికి 32 పళ్లుంటాయి. అది కూడా యువ వయస్సును పరిగణనలోకి తీసుకుంటే. కానీ.. ఈ వ్యక్తికి చూడండి.. 37 పళ్లున్నాయి. అంటే ఉండాల్సిన వాటికన్నా 5 ఎక్కువ ఉన్నాయి. దీంతో మనోడు అందరిలా కాకుండా స్పెషల్ పర్సన్ అయిపోయాడు. గిన్నిస్ బుక్‌లోకి ఎక్కేశాడు. బెంగళూరుకు చెందిన విజయ్‌కుమార్‌కు సాధారణ యువకులకు ఉండాల్సిన పళ్ల కన్నా 5 పళ్లు ఎక్కువగా ఉన్నాయని గిన్నిస్ వాళ్లు రికార్డు సర్టిఫికెట్ కూడా ఇచ్చారు. ఆయన గిన్నిస్ రికార్డులోకి ఎక్కింది 2014లోనే. సెప్టెంబర్ 20, 2014న ఆయన పళ్ల సంగతి జనాలకు తెలిసింది. ఆయన రికార్డు సాధించి నాలుగేండ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ కంపెనీ తన ఫేస్‌బుక్ పేజీలో ఆ రికార్డును ఒకసారి నెమరు వేసుకున్నది.

5421
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS