ఏలియన్ ఆకారంలో శిశువు జననంWed,March 22, 2017 03:49 PM
ఏలియన్ ఆకారంలో శిశువు జననం

చిన్న తల..హెడ్ లైట్స్‌లాంటి కళ్లు.. పెద్ద ముక్కు.. లావు బుగ్గలు.. టోటల్‌గా లాఫింగ్ బుద్ద లాగ ఉనాడు ఈ ఫోటోలోని శిశువు. ఖలీదా బేగం అనే మహిళ సోమవారం రాత్రి ఈ వింత బాలునికి జన్మనిచ్చింది. బీహార్ రాష్ట్రంలోని కతియార్‌కు చెందిన ఈ మహిళకు ఇప్పటికే నలుగులు పిల్లలు. ఏలియన్‌లా ఉన్న తన కుమారునికి పాలివ్వడానికి ఈ తల్లి మొదట నిరాకరించింది. తన కంటికి కనిపించకుండా ఎక్కడికైనా తీసుకెళ్లండి, ఈ వింత ఆకారాన్ని చూసి తల్లిగా తాను తట్టుకోలేనని ఆమె డాక్టర్లను మొరపెట్టుకుంది. కొన్ని గంటల తరువాత ఆమె తన కొడుకును దగ్గరకు తీసుకుని పాలివ్వడం ప్రారంభించింది. దేవుడిచ్చిన సంతానం, ఆంజనేయుని రూపమంటూ స్థానికులు ఈ శిశువు గురించి రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు.

మందమైన చర్మం, ఎదగని అవయవాలు వంటి అరుదైన జన్యులోపాలున్న ఇలాంటి శిశువులు చాలా అరుదుగా జన్మిస్తుంటారని వైద్యులు చెబుతున్నారు. హార్లెక్విన్ థైయోసిస్ సమస్యగా డాక్టర్లు దీన్ని పిలుస్తున్నారు. అనెన్ సెఫాలీ అనే మరో అరుదైన లోపంతో కూడా ఈ బాలుడు బాధపడుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు.

5657
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS