ముస్లింలకు అయోధ్యలోనే 5 ఎకరాల స్థలం

Sat,November 9, 2019 12:23 PM

న్యూఢిల్లీ: ఖాళీ స్థలంలో బాబ్రీ మసీదు నిర్మించలేదని పురావస్తు విభాగం నివేదికలు చెబుతున్నాయని అయోధ్య తుదితీర్పు కేసులో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ స్పష్టం చేశారు. అయోధ్య వివాదాస్పద స్థలం హిందువులదేనని అత్యున్నత న్యాయస్థానం తీర్పు వెలువరించింది.

'నమ్మకం, విశ్వాసం ప్రాతిపదికన కాకుండా ఆధారాలను బట్టి తీర్పు ఉంటుంది. వివాదాస్పద స్థలంలోని నిర్మాణాలకు ఇస్లామ్ మూలాలు లేవు. స్థలం తమ ఆధీనంలో ఉందని సున్నీ వక్ఫ్ బోర్డు నిరూపించలేకపోయింది. 1857కు ముందు నుంచే ఈ ప్రాంతాన్ని హిందువులు సందర్శించారనేందుకు ఆధారాలున్నాయి. అయోధ్యలోని 2.77 ఎకరాల స్థలాన్ని రామమందిర నిర్మాణానికి అప్పగించాలి. ప్రత్యామ్నాయంగా ముస్లింలకు అయోధ్యలోనే 5 ఎకరాల స్థలం ఇవ్వాలి. కేంద్రం లేదా రాష్ట్ర ప్రభుత్వం సున్నీ వక్ఫ్ బోర్డుకు 5 ఎకరాల స్థలాన్ని ఇవ్వాలి. మసీదు నిర్మాణానికి స్థలం కేటాయించేందుకు ట్రస్ట్ కూడా ఏర్పాటు చేయాలని' జస్టిస్ గొగోయ్ సూచించారు.

927
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles