రోడ్డు గుంతలపై వ్యోమగామిలా మారి నిరసన..వీడియో

Tue,September 3, 2019 04:49 PM

Baadal Nanjundaswamy dressed as an astronaut to reflects roads


బెంగళూరు: ప్రతీ రోజు వాహన రాకపోకలతో రద్దీగా ఉండే బెంగళూరులో రోడ్లు అధ్వాన్నంగా ఉండటంపై ఓ వ్యక్తి వినూత్నంగా నిరసన చేపట్టాడు. బాదల్‌ నంజుందాస్వామి అనే కళాకారుడు వ్యోమగామిలా దుస్తులు వేసుకుని రాత్రి సమయంలో గుంతలు ఏర్పడిన రోడ్డుపైకి వచ్చాడు. గగనతలంలో వ్యోమగాములు ఎలా నడుస్తారో..బాదల్‌ కూడా అచ్చు అలానే గుంతలపై నుంచి నడుస్తూ రోడ్ల పరిస్థితిపై నిరసన తెలియజేశాడు. బెంగళూరులో రోడ్లు దెబ్బతినడం ప్రధాన సమస్యగా మారింది. రోడ్లపై గుంతలు ఏర్పడటంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. అందుకోసమే ఈ సమస్యను అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో ఇలా చేయడం జరిగిందని బాదల్‌ నంజుందాస్వామి మీడియాతో అన్నాడు. బాదల్ షేర్ చేసిన ఈ వీడియో వైరల్ కావడంతో..బీబీఎంపీ (బృహత్ బెంగళూరు మహానగర పాలక సంస్థ) అధికారులు స్పందించి రోడ్ల మరమ్మతు పనులు ప్రారంభించారు.
1529
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles