అజర్ ట్రైలర్‌లో అదిరిన ఇమ్రాన్

Sat,April 2, 2016 12:33 PM

Azhar Trailer Released, Emraan Hashmi looks perfect

హైదరాబాద్ : బాలీవుడ్ ఇమ్రాన్ హష్మీ నటిస్తున్న అజర్ ఫిల్మ్ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. భారత మాజీ క్రికెటర్ అజర్ జీవిత కథాంశం ఆధారంగా సినిమాను రూపొందిస్తున్నారు. భారత క్రికెట్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన అజర్ తన కెరీర్‌లో ఎంతో సక్సెస్‌ను చూశారు. అలాగే ఆ స్టయిలిష్ క్రికెటర్ మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలకు గురయ్యారు. టోనీ డిసౌజా దర్శకత్వంలో వస్తున్న ఆ సినిమాలో ఇమ్రాన్ హష్మీ క్రికెటర్ రోల్‌లో నటిస్తున్నాడు.

ఫ్లిక్ షాట్లతో అందర్నీ ఆకట్టుకున్న అజర్ ఆటతీరును ఇమ్రాన్ తెరమీద అంతే అట్రాక్టివ్‌గా చూపించాడన్న కామెంట్స్ వస్తున్నాయి. ఈ ఫిల్మ్‌లో అజర్ తొలి భార్యగా ప్రాచీ దేశాయ్, రెండోవ భార్య సంగీత బిల్జానీ పాత్రను నర్గీస్ ఫక్రీ పోషిస్తున్నారు. లారా దత్తా, గౌతమ్ గులాటీ కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఏక్తా కపూర్ ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మే 13న అజర్ సినిమా థియేటర్లలో రిలీజ్ కానుంది.

1899
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles