ఏడ్చిన ఆజంఖాన్‌.. ఉసురు త‌గిలింద‌న్న జ‌య‌ప్ర‌ద‌

Fri,October 18, 2019 12:58 PM

హైద‌రాబాద్‌: ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని రాంపూర్‌లో జ‌రిగిన ఓ ర్యాలీలో స‌మాజ్‌వాదీ పార్టీ ఎంపీ ఆజంఖాన్ ఏడ్చారు. ఆ నియోజ‌క‌వ‌ర్గంలో ఆయ‌న‌పై సుమారు 80 కేసులు న‌మోదు అయ్యాయి. కోళ్లు, మేక‌లు ఎత్తుకెళ్లిన‌ట్లు కూడా కేసులు పెడుతున్నార‌ని ఆజం ఏడ్చేశారు. ఈ ఘ‌ట‌న ప‌ట్ల ఆ నియోజ‌క‌వ‌ర్గ మాజీ ఎంపీ జ‌య‌ప్ర‌ద స్పందించారు. ఆడ‌వాళ్ల క‌న్నీటి ఉసురు ఆజంకు త‌గిలింద‌ని జ‌య‌ప్ర‌ద అన్నారు. గ‌త లోక్‌స‌భ ఎన్నిక‌ల స‌మ‌యంలో బీజేపీలో చేరిన జ‌య‌ప్ర‌ద‌.. ఎస్పీ ఎంపీపై విరుచుకుప‌డ్డారు. ఆజంకు ఆడవారి క‌న్నీటి ఉసురు త‌గిలింద‌ని, అందుకే ప్ర‌తి మీటింగ్‌లో ఏడుస్తున్నాడ‌ని, గ‌తంలో త‌న‌ను ఓ మంచి న‌టిగా గుర్తించేవాడ‌ని, కానీ ఇప్పుడు ఏమంటున్నాడో తెలుస్తోంది క‌దా అంటూ జ‌య‌ప్ర‌ద విమ‌ర్శించారు. త‌న రాజ‌కీయ జీవితాన్ని నాశ‌నం చేసేందుకు ఆజంఖాన్ ప్ర‌య‌త్నించిన‌ట్లు జ‌య‌ప్ర‌ద ఆరోపించారు. యూనివ‌ర్సిటీ భూములను ఆజం క‌బ్జా చేసిన‌ట్లు కూడా ఓ కేసు న‌మోదు అయ్యింది. 2019 ఎన్నిక‌ల్లో ఆజం చేతిలో జ‌య‌ప్ర‌ద ఓటమిపాలైంది.

2969
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles