మ‌గ‌పిల్లాడు పుట్టాలంటే.. ఇలా చేయాల‌ట‌!

Mon,May 8, 2017 04:03 PM

Ayurveda textbook revealed an intriguing process to conceive a boy

పుణె: ఈ తాయ‌త్తు క‌ట్టుకోండి.. మ‌గ‌పిల్లాడు పుడ‌తాడు.. ఈ మందు వేసుకోండి అబ్బాయే పుడ‌తాడు.. అంటూ ఊళ్ల‌లో అమాయ‌క జ‌నాల‌ను బురిడి కొట్టించే వాళ్లు చాలా మందే ఉంటారు. అయితే సాక్షాత్తూ ఆయుర్వేదిక్ కోర్సులోనే ఓ పుస్త‌కంలో మ‌గ పిల్లాడు పుట్టాలంటే ఇలా చేయండంటూ కొన్ని సూచ‌న‌లు చేయ‌డం వివాద‌మవుతున్న‌ది. బ్యాచిల‌ర్ ఆఫ్ ఆయుర్వేదిక్‌, మెడిసిన్ అండ్ స‌ర్జ‌రీ మూడో ఏడాది టెక్ట్స్‌బుక్‌లో ఓ చిన్న చిట్కా చెప్పారు. అదేంటంటే.. తూర్పు లేదా ఉత్తరం దిక్కుగా ఉన్న రెండు మ‌ర్రి చెట్టు ఆకుల‌ను తీసుకొని అందులో క‌చ్చితంగా రెండు జీల‌క‌ర్ర గింజ‌ల‌ను వేసి నూరి, ఆ మిశ్ర‌మాన్ని గ‌ర్భ‌వ‌తి అయిన మ‌హిళ పుష్య న‌క్ష‌త్ర స‌మ‌యంలో పెరుగుతో క‌లిపి తినాల‌ని ఆ బుక్కులో రాశారు. ఇదొక్క‌టే కాదు మ‌గ పిల్లాడు పుట్టాలంటే.. మ‌రో ఐదు ప్ర‌క్రియ‌ల‌ను కూడా ఆ బుక్కులో వివ‌రించ‌డం గ‌మనార్హం.

గ‌ర్భ‌వ‌తి అయిన మ‌హిళ‌కు అధిక మోతాదులో బంగారం, వెండి, ఇత్త‌డి మిశ్ర‌మాన్ని తినిపించాల‌న్న‌ది అందులో ఒక ప్ర‌క్రియ‌. ఈ మూడింటి మిశ్ర‌మంతో ఓ బాలుని ప్ర‌తిమ చేసి.. దానిని క‌రిగించి పెరుగు, పాల మిశ్ర‌మంలో క‌లిపి అదే పుష్య న‌క్ష‌త్ర స‌మ‌యంలో తీసుకుంటే ఫ‌లితం ఉంటుంద‌ని ఆ పుస్త‌కంలో వివ‌రించారు. ఈ చిట్కాల‌ను చ‌ర‌క సంహిత‌ నుంచి స్వీక‌రించారు. ఈ పాఠ్య‌పుస్త‌కం పుట్ట‌బోయే పిల్ల‌ల లింగ నిర్ధార‌ణ నేర‌మ‌న్న ప్ర‌భుత్వ నిబంధ‌న‌ను ఉల్లంఘిస్తున్న‌ద‌ని కొంత‌మంది వాదిస్తున్నారు. ఈ బుక్కు రాజ్యాంగ విరుద్ధ‌మ‌ని సామాజిక కార్య‌క‌ర్త వ‌ర్ష దేశ్‌పాండే అన్నారు. ఇలాంటి మూఢ న‌మ్మ‌కాల‌ను వ్యాప్తి చేయ‌డం చాలా ప్ర‌మాద‌క‌ర‌మ‌ని, రాజ్యాంగం మ‌న‌కు ఇచ్చిన స‌మానత్వానికి ఇది విరుద్ధ‌మ‌ని ఆమె స్ప‌ష్టంచేశారు. ఈ చాప్ట‌ర్‌ను వెంట‌నే ఆ పాఠ్య పుస్త‌కం నుంచి తొల‌గించాల‌ని మ‌రో సామాజిక కార్య‌క‌ర్త గ‌ణేష్ బొరాడే డిమాండ్ చేశారు.

10882
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS