అయోధ్య కేసు చరిత్ర..

Sat,November 9, 2019 11:18 AM

-1528 : బాబ్రీ మసీదు నిర్మించి మొఘల్‌ చక్రవర్తి బాబర్‌ సైన్యాధ్యక్షుడు మీర్‌ బాఖీ
-1859 : స్థలంపై తొలిసారి కలహాలు, హిందూ, ముస్లింల ప్రార్థనకు వీలుగా కంచె నిర్మించిన బ్రిటీషర్లు
-1885 : వివాదాస్పద స్థలంలో గోపురం నిర్మాణ అనుమతి కోసం ఫైజాబాద్‌ కోర్టులో మహంత్‌ రఘువీర్‌ దాస్‌ కేసు, తిరస్కరించిన కోర్టు
-1950 : శ్రీరామ పూజ హక్కు కల్పించాలని ఫైజాబాద్‌ కోర్టులో గోపాల్‌ విశారద్‌ కేసు
-1950 : పూజలు కొనసాగింపునకు, విగ్రహాలు ఉంచేందుకు కేసు ఫైల్‌ చేసిన పరమహంస రామచంద్ర దాస్‌
-1959 : స్థలాన్ని అప్పగించాలని కేసు వేసిన నిర్మోహి అఖాడా


-1981 : స్థలం తమకు అప్పగించాలని కోరుతూ కేసు దాఖలు చేసిన యూపీ సున్నీ సెంట్రల్‌ వక్ఫ్‌ బోర్డు
-1986, ఫిబ్రవరి 1 : హిందూ భక్తుల కోసం స్థలాన్ని తెరవాలని ప్రభుత్వాన్ని ఆదేశించిన స్థానిక కోర్టు
-1989, ఆగస్టు 14 : వివాదాస్పద నిర్మాణం విషయంలో యథాతథ స్థితి కొనసాగించాలని అలహాబాద్‌ హైకోర్టు ఆదేశం
- 1992, డిసెంబర్‌ 16 : జస్టిస్‌ లిబర్‌హాన్‌ నేతృత్వంలో కమిషన్‌ ఏర్పాటు చేసిన పీవీ నరసింహారావు ప్రభుత్వం
- 1993, ఏప్రిల్‌ 3 : వివాదాస్పద స్థలంలో కొంత భాగాన్ని స్వాధీనం చేసుకునేందుకు చట్టం తెచ్చిన కేంద్రం

- 1993 : చట్టాన్ని సవాల్‌ చేస్తూ అలహాబాద్‌ హైకోర్టులో అనేక రిట్‌ పిటిషన్లు
- 1994, అక్టోబర్‌ 4 : మసీదు అన్నది ఇస్లాంలో భాగం కాదని ఇస్మాయిల్‌ ఫరూఖీ కేసులో చారిత్రక తీర్పు చెప్పిన సుప్రీంకోర్టు
-1997, సెప్టెంబర్‌ : ఎల్‌కే అద్వానీ, జోషి, కల్యాణ్‌ సింగ్‌ సహా 49 మందిపై మోపిన అభియోగాలపై ప్రత్యేక కోర్టులో విచారణ
- 2001 : రామమందిర నిర్మాణానికి 2002 తుది గడువు అని ప్రకటించిన విశ్వహిందూ పరిషత్‌
- 2002, ఫిబ్రవరి 4 : అయోధ్యలో మతపరమైన కార్యక్రమాలపై విధించిన స్టే ఎత్తివేయాలని సుప్రీంలో కేంద్రం పిటిషన్‌
- 2002, ఏప్రిల్‌ : అయోధ్య స్థలం ఎవరిదనే దానిపై అలహాబాద్‌ హైకోర్టు లక్నో బెంచ్‌లో విచారణ

- 2002, జూన్‌ : హిందూ, ముస్లింలతో చర్చల కోసం అయోధ్య సెల్‌ ఏర్పాటు చేసిన ప్రధాని వాజ్‌పేయి
- 2003, మార్చి 13 : వివాదాస్పద స్థలంలో మతపరమైన కార్యక్రమాలకు అనుమతి లేదని ప్రకటించిన సుప్రీంకోర్టు
- 2009, జూన్‌ : నివేదిక సమర్పించిన జస్టిస్‌ లిబర్‌హాన్‌ కమిషన్‌, వివరాలు రహస్యం
- 2010, సెప్టెంబర్‌ 30 : వివాదాస్పద స్థలాన్ని మూడు భాగాలుగా విభజిస్తూ హైకోర్టు తీర్పు
- వివాదాస్పద స్థలాన్ని సున్నీ వక్ఫ్‌ బోర్డు, నిర్మోహీ అఖాడా, రామ్‌లల్లా మధ్య విభజించిన హైకోర్టు

-2011, మే 9 : అయోధ్య భూవివాదంపై హైకోర్టు తీర్పుపై స్టే విధించిన సుప్రీంకోర్టు
- 2016, ఫిబ్రవరి 26 : వివాదాస్పద స్థలంలో రామమందిర నిర్మాణానికి అనుమతి కోరుతూ సుప్రీంకోర్టులో సుబ్రహ్మణ్యస్వామి పిటిషన్‌
- 2017, మార్చి 21 : కోర్టు వెలుపల రాజీ కుదుర్చుకోవాలని సూచించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జేఎస్‌ ఖేహార్‌
- 2017, నవంబర్‌ 20 : అయోధ్యలో రామమందిరం, లక్నోలో మసీదు నిర్మించవచ్చని సుప్రీంకు తెలిపిన యూపీ షీయా సెంట్రల్‌ వక్ఫ్‌ బోర్డు
- 2017, సెప్టెంబర్‌ 27 : ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనానికి కేసు బదిలీ చేయాలన్న విజ్ఞప్తిని తిరస్కరించిన సుప్రీంకోర్టు

- 2018, మార్చి 23 : ఇస్లాంలో మసీదుకు ప్రత్యేక స్థానం లేదని స్పష్టం చేసిన సుప్రీంకోర్టు
- 2019, జనవరి 25 : అయోధ్య కేసు విచారణకు ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం ఏర్పాటు
- 2019, మే 10 : మధ్యవర్తిత్వ ప్రక్రియ గడువు ఆగస్టు 15 వరకు పొడిగించిన సుప్రీంకోర్టు
- 2019, ఆగస్టు 1 : సీల్డ్‌ కవర్‌లో నివేదిక సమర్పించిన మధ్యవర్తిత్వ కమిటీ
- 2019, ఆగస్టు 2 : మధ్యవర్తిత్వం విఫలమవడంతో ఆగస్టు 6, 2019 నుంచి కేసు విచారణ రోజువారీ చేపడుతామని ప్రకటించిన సుప్రీంకోర్టు
- అయోధ్య కేసులో 40 రోజుల పాటు సుదీర్ఘంగా వాదనలు విన్న సుప్రీంకోర్టు
- 2019, సెప్టెంబర్‌ 16 : అత్యున్నత న్యాయస్థానంలో ముగిసిన విచారణ
- 2019, నవంబర్‌ 9 : అయోధ్యలో వివాదాస్పద రామజన్మభూమి - బాబ్రీ మసీదు కేసులో తుదితీర్పు

2715
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles