లిబియా దాడి.. 140కి చేరిన మృతుల సంఖ్య‌

Sat,May 20, 2017 09:00 AM

Attack on Libya airbase, death toll rises to 140

ట్రైపొలి: లిబియాలో వైమానిక స్థావ‌రంపై గురువారం దాడి జ‌రిగింది. ఆ ఘ‌ట‌న‌లో 140 మంది మృతిచెందారు. బ్రాక్ అల్ షాతి ఎయిర్‌బేస్‌ను ప్ర‌భుత్వ అనుబంధ మిలిట‌రీ స్వాధీనం చేసుకునే ప్ర‌య‌త్నం చేసింది. ఈ నేప‌థ్యంలో ఖ‌లీఫా హ‌ఫ్తార్ వ‌ర్గానికి చెందిన సైనికులు ప్రాణాలు కోల్పోయారు. దాడికి బాధ్యులైన‌ ప్ర‌భుత్వ ర‌క్ష‌ణ శాఖ మంత్రి, మిలిట‌రీ క‌మాండ‌ర్ల‌ను ప్ర‌ధాని స‌స్పెండ్ చేశారు. వాళ్ల‌పై ప్ర‌భుత్వం విచార‌ణ‌కు ఆదేశించింది. వైమానిక స్థావ‌రంలో ఉన్న శత్రు శ‌క్తుల‌న్నింటినీ ధ్వంసం చేసిన‌ట్లు ప్ర‌భుత్వ మిలిట‌రీ పేర్కొన్న‌ది. ఎయిర్‌బేస్‌లో ఉన్న విమానాల‌కు నిప్పుపెట్టిన‌ట్లు తెలుస్తున్న‌ది.

లిబియా నేష‌న‌ల్ ఆర్మీ (ఎల్ఎన్ఏ) అని చెప్పుకుంటున్న ద‌ళానికి చెందిన సైనికులు ప్ర‌భుత్వ మిలిట‌రీ జ‌రిపిన దాడిలో చ‌నిపోయారు. ట్రైపొలిలో ఉన్న ప్ర‌భుత్వాన్ని లిబియా నేష‌న‌ల్ ఆర్మీ గుర్తించ‌డం లేదు. దీంతో అక్క‌డ ఉన్న ఎయిర్‌బేస్‌ను గ‌త డిసెంబ‌ర్‌లో వాళ్లు స్వాధీనం చేసుకున్నారు. అయితే గురువారం జ‌రిగిన దాడి ఘ‌ట‌న‌లో ఎన్ఎన్ఏకు చెందిన సైనికులు ప్రాణాలు కోల్పోయారు. సైనికులు ప‌రేడ్ ముగించుకుని ఎయిర్‌బేస్‌కు తిరిగి వ‌స్తున్న స‌మ‌యంలో దాడి జ‌రిగింది. దాడి జ‌రిగిన స‌మ‌యంలో నేష‌న‌ల్ ఆర్మీ సైనికుల ద‌గ్గ‌ర ఆయుధాలు లేవు. 15 రోజుల్లోగా ఈ ఘ‌ట‌న‌పై నివేదిక ప్ర‌ధానికి చేర‌నున్న‌ది.

843
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS