బీఫ్ బిర్యానీ తిని పడుకున్నారా.. మోదీపై అసద్ ఆగ్రహం

Sun,March 24, 2019 10:16 AM

Ate Beef Biryani and slept says MP Asaduddin Owaisi about Modi on Pulwama Attack

హైదరాబాద్: ఏఐఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ప్రధాని మోదీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పుల్వామా దాడి జరుగుతుంటే.. మోదీ బీఫ్ బిర్యానీ తిని పడుకున్నారా అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ బాలాకోట్‌లో బాంబులు వేసింది. ఇందులో 250 మంది ఉగ్రవాదులు చనిపోయారని బీజేపీ చీఫ్ అమిత్ చెప్పారు. అక్కడ దాడి సమయంలో 300 సెల్‌ఫోన్లు ఉన్నట్లు ఎన్టీఆర్పీ చెప్పినట్లు హోంమంత్రి రాజ్‌నాథ్ అన్నారు. బాలాకోట్‌లో 300 సెల్‌ఫోన్లు ఉన్నాయని తెలుసు కానీ.. పుల్వామా దాడి కోసం 50 కిలోల ఆర్డీఎక్స్ మీ కళ్ల ముందు నుంచే వెళ్తే కనిపించలేదు. దాడి సమయంలో మోదీ, రాజ్‌నాథ్ బీఫ్ బిర్యానీ తిని పడుకున్నారా అంటూ అసదుద్దీన్ అన్నారు. దేశంలో లౌకికవాదాన్ని, సోదరభావాన్ని అంతమొందించాలని చూస్తున్న వాళ్లకు వ్యతిరేకంగానే తన పోరాటమని అసద్ స్పష్టం చేశారు. దేశంలో ఎవరైనా రెండు జాతీయ పార్టీలు ఉన్నాయంటే నేను కాదంటాను. ఎందుకంటే బీజేపీ, కాంగ్రెస్ రెండూ ఒక్కటే. ఒకటి బీజేపీ అయితే మరొకటి 1.5 బీజేపీ అని అసద్ అన్నారు.

3250
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles