పార్ల‌మెంట్ సెంట్ర‌ల్ హాల్‌లో అట‌ల్‌జీ భారీ చిత్రప‌టం

Tue,February 12, 2019 11:31 AM

Atal Bihari Vajpayees portrait unveiled at Parliament Central Hall

న్యూఢిల్లీ: భార‌త ర‌త్న, మాజీ ప్ర‌ధాని అట‌ల్ బిహారీ వాజ్‌పేయి భారీ చిత్ర‌ప‌టాన్ని ఇవాళ పార్ల‌మెంట్ సెంట్ర‌ల్ హాల్‌లో మోదీ ఆవిష్క‌రించారు. ఈ కార్య‌క్ర‌మంలో లోక్‌స‌భ స్పీక‌ర్ సుమిత్రా మ‌హాజ‌న్‌, కాంగ్రెస్ సీనియ‌ర్ నేత గులాం న‌బీ ఆజాద్‌లు కూడా పాల్గొన్నారు. కొత్త రూపంలో అట‌ల్‌జీ మ‌న‌ల్ని ఆశీర్వ‌దిస్తార‌ని, ప్రేర‌ణ ఇస్తార‌ని ఆశిస్తున్న‌ట్లు మోదీ తెలిపారు. అట‌ల్‌జీది అతి సుదీర్ఘ రాజ‌కీయ కెరీర్ అని, ఆయ‌న త‌న కెరీర్‌లో ఎక్కువ శాతం ప్ర‌తిప‌క్షంలో ఉన్నార‌ని మోదీ ఓ ట్వీట్ చేశారు. ప్ర‌తిప‌క్షంలో ఉంటూనే ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై పోరాటం చేశార‌న్నారు. కానీ త‌న ఐడియాల‌జీ నుంచి ఆయ‌న ఎన్నుడూ వేరుకాలేద‌న్నారు. అట‌ల్‌జీ ప్ర‌సంగంలో ప‌వ‌ర్ ఉండేద‌ని, ఆయ‌న మౌనం కూడా అంతే శ‌క్తివంతంగా ఉండేద‌న్నారు. వాజ్‌పేయి క‌మ్యూనికేష‌న్ నైపుణ్యం అసాధార‌ణ‌మైంద‌ని, ఆయ‌న‌లో హాస్య చ‌తుర‌త కూడా ఎక్కువే అన్నారు.483
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles