జైలులో అల్ల‌ర్లు.. 32 మంది మృతి

Mon,May 20, 2019 12:32 PM

At Least 32 Killed In Tajik Prison Riot

హైద‌రాబాద్‌: త‌జ‌కిస్తాన్ జైలులో జ‌రిగిన అల్ల‌ర్ల‌లో మొత్తం 32 మంది మృతిచెందిన‌ట్లు ఆ దేశ న్యాయ‌శాఖ మంత్రి వెల్ల‌డించారు. మృతిచెందిన‌వారిలో 29 మంది ఖైదీలు ఉన్నారు. మే 19వ తేదీన జైలులో ఘ‌ర్ష‌ణ త‌లెత్తింది. వాహ‌ద‌త్ న‌గ‌రంలో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. రాజ‌ధాని దుషాన్బేకు 25 కిలోమీట‌ర్ల దూరంలో వాహ‌ద‌త్ ఉంది. సుమారు అర‌గంట పాటు కాల్పుల శ‌బ్ధాలు వినిపించిన‌ట్లు ఖైదీల‌కు చెందిన కుటుంబీకులు చెప్పారు. ఇస్లామిక్ స్టేట్‌కు చెందిన ఖైదీలు ముగ్గురు సెక్యూర్టీ గార్డుల‌ను కూడా చంపేసిన‌ట్లు అధికారులు వెల్ల‌డించారు. ప్ర‌స్తుతం ప‌రిస్థితి అదుపులో ఉంది. ఘ‌ట‌న‌పై విచార‌ణ‌కు ఆదేశించారు.

2865
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles