కోర్టు ఎదుట లొంగిపోయిన ఆశిష్ పాండే.. ఒకరోజు రిమాండ్

Thu,October 18, 2018 02:04 PM

Ashish Pandey who flashed gun surrenders before Patiala Court

న్యూఢిల్లీ : బీఎస్పీ నేత, మాజీ ఎంపీ రాకేశ్ పాండే కుమారుడు ఆశిష్ పాండే ఈ నెల 14న ఢిల్లీలోని హయత్ రెసిడెన్సీ హోటల్ ఎదుట తుపాకీతో హంగామా స్పష్టించిన సంగతి తెలిసిందే. మాజీ ఎమ్మెల్యే కన్వార్ కరణ్ సింగ్ కుమారుడు కన్వార్ గౌరవ్ ఫిర్యాదు మేరకు ఆశిష్‌పై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఢిల్లీలోని పటియాల కోర్టు ఆశిష్‌పై నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ చేశారు. దీంతో ఆశిష్ పాండే ఇవాళ పటియాల కోర్టు ఎదుట లొంగిపోయారు. అనంతరం ఆయనకు కోర్టు.. ఒకరోజు పోలీసు రిమాండ్ విధించింది. న్యాయవ్యవస్థపై నమ్మకం ఉండడంతోనే తాను లొంగిపోయానని చెప్పిన ఆశిష్.. తనపై ఒక్క పోలీసు కేసు కూడా లేదని పేర్కొన్నారు. తన భద్రత కోసం తాను తుపాకీ తెచ్చుకున్నాను తప్ప ఎవర్నీ బెదిరించలేదని పాండే స్పష్టం చేశారు. అక్కడున్న సీసీ కెమెరాలను పరిశీలిస్తే ఎవరు ఎవర్నీ బెదిరించారో తెలుస్తుందని ఆయన చెప్పారు.

892
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS