మంత్రి పదవి వద్దంటూ మోదీకి లేఖ

Wed,May 29, 2019 02:30 PM

Arun Jaitley Tells PM Cant Be In New Government, Need Time For Treatment

న్యూఢిల్లీ: కేంద్రంలో కొలువుదీరనున్న నూతన కేబినెట్‌లో తనకు బాధ్యతలు అప్పగించవద్దని ప్రధాని నరేంద్రమోదీని బీజేపీ సీనియర్ నేత అరుణ్‌జైట్లీ కోరారు. ఈ మేరకు బుధవారం మోదీకి జైట్లీ లేఖ రాశారు. తనకు మంత్రి పదవి వద్దంటూ లేఖలో పేర్కొన్నారు. ''ఐదేళ్లుగా మీ నాయకత్వంలో మంత్రిగా పనిచేసినందుకు గర్వంగా ఉంది. గత 18 నెలల నుంచి తీవ్ర అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నాను. అనారోగ్యం నుంచి కోలుకునేందుకు సమయం పడుతుంది. చికిత్స చేయించుకోవడం కోసం.. కోలుకునేందుకు సమయం కావాలి. ఆరోగ్యరీత్యా విశ్రాంతి అవసరమని వైద్యుల సూచించారు. సార్వత్రిక ఎన్నికల్లో మీ(మోదీ) సారథ్యంలోని బీజేపీ, ఎన్డీఏ అద్భుతమై మెజార్టీ సాధించాయి. కొత్త ప్రభుత్వం రేపు కొలువుదీరనుంది. గత ఐదేళ్లుగా మీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసినందుకు గొప్ప గౌరవంగా భావిస్తున్నాను. అనధికారికంగా పార్టీకి, ప్రభుత్వానికి సేవలందిస్తాను''అని జైట్లీ లేఖలో వివరించారు. రేపు రాత్రి 7 గంటలకు రెండోసారి ప్రధానిగా మోదీ ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఎన్డీఏ ప్రభుత్వంలో జైట్లీ ఆర్థిక మంత్రిగా పనిచేశారు. కొద్దిరోజుల క్రితం చికిత్స నిమిత్తం ఆయన అమెరికాకు వెళ్లడంతో కొద్దిరోజుల పాటు ఆ శాఖను పియూశ్ గోయల్‌కు తాత్కాలికంగా అప్పగించారు.

4388
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles