విషమంగానే జైట్లీ ఆరోగ్యం.. ప్రముఖుల పరామర్శ

Sat,August 17, 2019 05:47 PM

Arun Jaitley on life support

న్యూఢిల్లీ: బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి అరుణ్‌ జైట్లీ ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. ఆనారోగ్యం కారణంగా కొద్ది రోజుల క్రితం ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేరిన ఆయనకు ప్రత్యేక వైద్య బందం చికిత్స అందిస్తోంది. ప్రస్తుతం ఆయనను లైఫ్‌ సపోర్ట్‌పై ఉంచినట్లు వైద్యులు శనివారం తెలిపారు. పలువురు రాజకీయ ప్రముఖులు ఇవాళ ఆసుపత్రిలో జైట్లీని పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు.

జమ్ము కశ్మీర్ గవర్నర్ సత్యపాల్ మాలిక్, బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, కేంద్ర మంత్రి పియూశ్ గోయల్, కాంగ్రెస్ నేతలు అభిషేక్ సింఘ్వీ, జ్యోతిరాధిత్య సింధియా, బీఎస్పీ అధినేత్రి, మాజీ ముఖ్యమంత్రి మాయావతి తదితరులు ఎయిమ్స్‌కు వెళ్లి ఆయనను పరామర్శించారు.

1799
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles