తెలంగాణలో ఎయిమ్స్ ఏర్పాటుకు కేంద్రం సిద్ధం

Mon,March 20, 2017 06:04 PM

న్యూఢిల్లీ : తెలంగాణలో ఎయిమ్స్ ఏర్పాటుకు కేంద్రం సిద్ధమైంది. వారం పది రోజుల్లో ఎయిమ్స్ ఏర్పాటు చేయదగ్గ ప్రాంతాలపై నివేదికను కేంద్రం కోరనుంది. రాష్ట్ర ప్రభుత్వం 3 ప్రదేశాలు చూపిస్తే వాటి నుంచి ఒక ప్రాంతాన్ని కేంద్రం ఎంపిక చేయనుంది. 2017-18 బడ్జెట్ రిైప్లెలో టీఆర్‌ఎస్ ఎంపీ జితేందర్‌రెడ్డి ఎయిమ్స్‌పై ప్రస్తావించగా.. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అంగీకరించారు.

ఎయిమ్స్‌తో పాటు పలు అంశాలను జితేందర్‌రెడ్డి ప్రస్తావించారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలకు కేంద్రం ఆర్థిక సాయం అందించాలని కోరారు. ఇటీవలే తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను ప్రస్తావిస్తూ.. ఏయే వర్గాలను ఆదుకుంటుందో వివరించారు. ఉత్తరప్రదేశ్‌లో రైతుల రుణమాఫీకి కేంద్రం సహకారం అందిస్తున్నదని, అలాగే ఇతర రాష్ర్టాలకు సహకరించాలని డిమాండ్ చేశారు. హైకోర్టు విభజనను త్వరగా పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు.

2228

More News

మరిన్ని వార్తలు...