జీఎస్టీతో అవినీతి తగ్గుతుంది..

Tue,October 24, 2017 05:09 PM

Arun Jaitely addresses the media in Delhi Today


న్యూఢిల్లీ: గడిచిన మూడేళ్లలో దేశ ఆర్థిక వ్యవస్థ, వృద్ధి రేటు బాగానే ఉందని కేంద్రమంత్రి అరుణ్‌జైట్లీ వెల్లడించారు. ఇవాళ ఢిల్లీలో అరుణ్‌జైట్లీ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో జైట్లీ మాట్లాడుతూ దేశ ఆర్థికవ్యవస్థలను క్షుణ్ణంగా పరిశీలించాం. గత కొన్ని వారాల ఆర్థికవ్యవస్థపై చాలా సమీక్షలు జరిగాయన్నారు. ఆర్థిక సంస్కరణల ఫలితాలు దీర్ఘకాలంలో అందరికీ అందుతాయని తెలిపారు. ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామని జైట్లీ స్పష్టం చేశారు. జీఎస్టీతో అవినీతి తగ్గుతుందని తెలిపారు.

పెట్టుబడుల ఉపసంహరణ నిర్దేశిత లక్ష్యం రూ.72 వేల కోట్లు దాటిందని ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి సుభాష్ గార్గ్ తెలిపారు. చైనా వృద్ధిరేటు 6 శాతం వద్దే నిలిచిపోతే..మనం 8 శాతం నమోదు చేస్తున్నామని పేర్కొన్నారు. కరెంట్ ఖాతా లోటు చాలా తక్కువస్థాయిలో ఉంది. గత మూడేళ్లుగా జీడీపీ సగటు 7.5శాతంగా ఉందని వెల్లడించారు. నల్లధనంపై పోరులో నోట్లరద్దు ప్రధానమైందని, నోట్ల రద్దు కంటే జీఎస్టీ అమలు అతిపెద్ద ఆర్థిక సంస్కరణ అని తెలిపారు.
1400
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles