‘పుష్పక విమానం’లో అయోధ్యకు రాముడు, సీతWed,October 18, 2017 06:01 PM
‘పుష్పక విమానం’లో అయోధ్యకు రాముడు, సీత


యూపీ: ఉత్తరప్రదేశ్‌లో దీపావళి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. దీపావళి సంబరాల నేపథ్యంలో అయోధ్య రామాయణ దృశ్యకావ్యాన్ని కండ్లకు కట్టినట్లు చూపించే వేదికగా మారింది. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అయోధ్యలో రామాయణ దృశ్య కావ్యాన్ని మరోసారి గుర్తుకుతెచ్చేలా ఏర్పాట్లు చేశారు. రాముడు, సీత, లక్ష్మణుల వేషధారణలో ఉన్న కళాకారులు ‘పుష్పక విమానం’ (ప్రత్యేక హెలికాప్టర్) లో వచ్చి అయోధ్యలోని రామకథాస్థల్‌లో ల్యాండింగ్ అయ్యారు. ఆ తర్వాత సీఎం యోగి ఆదిత్యనాథ్ రాముడు, సీత, లక్ష్మణులకు అయోధ్యలోకి ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సీఎం యోగి ఆదిత్యనాథ్ రాముడు, సీత, లక్ష్మణులకు హారతిఇచ్చి పూలమాల వేశారు. అనంతరం సీఎం యోగి ఆదిత్యనాథ్ వారితో కలిసి ఫొటోలు దిగారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ రామ్‌నాయక్ కూడా పాల్గొన్నారు.
ayodhya-diwali6
up-diwali


1844
data-page-url = "https://www.ntnews.com/about-us.aspx">
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS