3వేల యాంటీ ట్యాంక్ గైడెడ్ మిస్సైళ్ల కొనుగోలు..

Mon,January 21, 2019 01:38 PM

Army plans to buy over 3,000 anti tank guided missiles from France

న్యూఢిల్లీ: భార‌త సైన్యం త‌న ఆయుధ సంప‌త్తిని పెంచుకోనున్న‌ది. దీని కోసం సుమారు మూడు వేల మిలాన్ 2టీ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిస్సైళ్ల‌ను కొనుగోలు చేయ‌నున్న‌ది. ఫ్రాన్స్ నుంచి వీటిని కొనేందుకు భార‌త ఆర్మీ ప్లాన్ చేస్తోంది. ఆ యాంటీ ట్యాంక్ మిస్సైళ్ల విలువ సుమారు వెయ్యి కోట్లు ఉంటుంద‌ని అధికారులు అంచ‌నా వేస్తున్నారు. ర‌క్ష‌ణ మంత్రిత్వ‌శాఖ ఉన్న‌త స్థాయి స‌మావేశంలో ఈ ప్ర‌తిపాద‌న‌పై చ‌ర్చ‌లు జ‌రిగ‌న‌ట్లు తెలుస్తోంది. సెకండ్ జ‌న‌రేష‌న్‌కు చెందిన ఏటీజీఎంల‌ను ఫ్రాన్స్ స‌హ‌కారంతో భార‌త డైన‌మిక్స్ లిమిటెడ్(బీడీఎల్‌) నిర్మిస్తుంది. భార‌త్‌కు సుమారు 70వేల ఏటీజీఎంలు అవ‌స‌రం ఉంది. మ‌రో 850 లాంచ‌ర్లు కూడా అవ‌స‌ర‌మ‌ని తేలింది.

1031
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles