పాసింగ్ ఔట్ పరేడ్‌లో లవ్ ప్రపోజల్.. ఫోటో వైరల్

Fri,September 14, 2018 03:20 PM

Army officer proposes to girlfriend after passing out parade in chennai

ప్రేమంటే ఇదేరా.. 2018, సెప్టెంబర్ 8.. చెన్నైలోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ.. పాసింగ్ ఔట్ పరేడ్‌లో శిక్షణ పూర్తి చేసుకున్న ఆర్మీ ఆఫీసర్లు అంతా తమ తల్లితండ్రులు, బంధువులతో ముచ్చటిస్తూ హుషారుగా ఉన్నారు. కానీ ఓ ఆర్మీ క్యాడెట్ మాత్రం వినూత్నంగా ఓ అమ్మాయికి ప్రపోజ్ చేసి అందరినీ సంభ్రమాశ్చర్యాలకు గురి చేశాడు.

అసలు ఆ క్యాడెట్ పాసింగ్ ఔట్ పరేడ్ వేదికగానే ఎందుకు ప్రపోజ్ చేయాల్సి వచ్చిందంటే ఆరేళ్లు వెనక్కి వెళ్లాల్సిందే. బెంగళూరులోని సెయింట్ జోసెఫ్ కాలేజీలో 2012లో చంద్రేశ్, ధార మెహతా.. డిగ్రీలో ప్రవేశం పొందారు. వీరిద్దరి గ్రూపులు వేరే అయినప్పటికీ హిందీ తరగతిలో కలుసుకునేవారు. అయితే అప్పటి వరకు చంద్రేశ్ ఎవరో.. ధారకు తెలియదు. కానీ చంద్రేశ్‌ను చూసి ధార మనసు పారేసుకుంది. మొదటి రెండు సంవత్సరాలు వీరిద్దరూ స్నేహంగా ఉన్నారు.

డిగ్రీ చివరి సంవత్సరంలో ఒకరికొకరు తమ మనసులను పంచుకున్నారు. ఆ సమయంలోనే చంద్రేశ్‌ను ప్రేమిస్తున్నట్లు ధార తన మససులోని మాటను చెప్పేసింది. అయితే చంద్రేశ్ మాత్రం నిశ్శబ్దంగా ఉండిపోయాడు. జీవితంలో స్థిరపడాలని చెప్పాడు. సర్వీస్ సెలక్షన్ బోర్డు ఎగ్జామ్స్ అయిపోయాక చూద్దామని ధారకు చంద్రేశ్ చెప్పాడు. తొలిసారి సర్వీస్ సెలక్షన్ బోర్డు ఎగ్జామ్స్‌లో ఫెయిల్ అయ్యాడు. ధార ప్రోత్సాహంతో మరోసారి ప్రయత్నం చేసి ఆ ఎగ్జామ్స్‌లో ఉత్తీర్ణత సాధించాడు.

మొత్తానికి చెన్నైలోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలో శిక్షణ పూర్తి చేసుకున్నాడు చంద్రేశ్. మూడున్నరేళ్లుగా తన ప్రేమ కోసం ఎదురుచూస్తున్న తన ప్రియురాలు ధారకు సెప్టెంబర్ 8న పాసింగ్ ఔట్ పరేడ్‌లో ప్రపోజ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. తక్షణమే ఆర్మీ ఉన్నతాధికారుల అనుమతి తీసుకొని.. తన కుటుంబంతో పాటు ధార కుటుంబ సభ్యులను, ఆమెను పరేడ్‌కు ఆహ్వానించాడు. పరేడ్ అయిపోయిన వెంటనే ధారకు ప్రపోజ్ చేశాడు. దీంతో ఇరు కుటుంబాలు సంతోషం వ్యక్తం చేస్తూ.. వీరిద్దరి ప్రేమను అంగీకరించారు. ప్రపోజ్ చేసిన ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో ఇప్పుడు వైరల్ అయ్యాయి.

3196
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles