ఆర్మీ పాసింగ్ ఔట్ పరేడ్‌లోనే గర్ల్‌ఫ్రెండ్‌కు ప్రపోజ్ చేశాడు..!

Fri,September 14, 2018 07:05 PM

Army officer proposes to girlfriend after passing out parade at OTA Chennai,

అది సెప్టెంబర్ 8, 2018. ఆరోజును మాత్రం ఆర్మీ ఆఫీసర్ ఠాకూర్ చంద్రేశ్ సింగ్ తన జీవితంలో మరిచిపోడు. ఎందుకంటే చంద్రేశ్ అదేరోజు చెన్నైలోని ఆఫీసర్ ట్రెయినింగ్ అకాడమీ(ఓటీఏ)లో తన ఆర్మీ ట్రెయినింగ్ పూర్తిచేసుకున్నాడు. అదే రోజు పాసింగ్ ఔట్ పరేడ్ దగ్గరే తన గర్ల్ ఫ్రెండ్ ధారకు ప్రపోజ్ చేసి తన లవ్‌ను సక్సెస్ చేసుకున్నాడు. గ్రేట్ కదా. ఇక.. మనోడు తన గర్ల్ ఫ్రెండ్‌కు ప్రపోజ్ చేస్తున్నప్పుడు తీసిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తుండటంతో అసలేంటి మ్యాటర్ అని మీడియా చంద్రేశ్‌ను పలకరించింది. అప్పుడు చంద్రేశ్ ఏమన్నాడంటే..

2012 లో మేమిద్దం బెంగళూరులోని సెయింట్ జోసెఫ్ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్‌లో కలుసుకున్నాం. మాఇద్దరివి వేరే గ్రూప్స్ అయినా హిందీ సబ్జెక్ట్‌కు మాత్రం కలిసే క్లాస్ ఉండేది. అలా మాఇద్దరి మధ్య పరిచయం పెరిగింది. ఫస్ట్ రెండేళ్లు అప్పుడప్పుడు మాత్రమే మాట్లాడుకునేవాళ్లం. మూడో సంవత్సరంలో మాత్రం బెస్ట్ ఫ్రెండ్స్‌గా ఉన్నాం. మాఇద్దరికి ఒకరి మీద మరొకరి లోపల ప్రేమ ఉన్నా బయటికి మాత్రం చెప్పుకునేవాళ్లం కాదు. తర్వాత నేను సర్వీస్ సెలక్షన్ బోర్డ్‌కు ప్రిపేర్ అవడం ప్రారంభించాను. అంతకుముందే మా పేరెంట్స్‌కు ధార ఫోటో చూపించాను. వాళ్లు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు కానీ.. నేను సాధించాల్సి చాలా ఉంది. అందుకే.. జీవితంలో ఏదో ఒకటి సాధించాక తనకు ప్రపోజ్ చేయాలనుకున్నాను. అందుకే.. నా ఆర్మీ పాసింగ్ అవుట్ పరేడ్‌కు తనను, తన పేరెంట్స్‌ను ఆహ్వానించాను. వాళ్లు వచ్చారు. ముందే ఆర్మీ అధికారుల దగ్గర పర్మిషన్ తీసుకొని పరేడ్ అయిపోగానే తనకు ప్రపోజ్ చేశా. తను కూడా ఎస్ చెప్పింది. ఇప్పుడు నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే జీవితంలో గెలిచాను.. ఇటు కెరీర్‌లో కూడా సెటిల్ అయ్యాను కదా.. ఈరోజు కోసం ఎన్ని రోజులు వెయిట్ చేశానో... అంటూ తన లవ్‌స్టోరీని పంచుకున్నాడు చంద్రేశ్.

349
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS