ఆ ఆర్మీ మేజ‌ర్‌ను మెచ్చుకున్న కోర్టు!

Mon,May 15, 2017 03:09 PM

శ్రీన‌గ‌ర్‌: జ‌మ్ముక‌శ్మీర్‌లో ఆందోళ‌న‌కారుల రాళ్ల‌దాడి నుంచి త‌ప్పించుకోవ‌డానికి ఆర్మీ జీపున‌కు ఓ వ్య‌క్తిని మాన‌వ క‌వ‌చంగా క‌ట్టేసిన విష‌యం తెలిసిందే క‌దా. ఏప్రిల్ 9న క‌శ్మీర్‌లోని బుద్గామ్‌లో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. ఈ ఘ‌ట‌న‌పై మిశ్ర‌మ స్పంద‌న వ‌చ్చింది. ఈ నిర్ణ‌యం తీసుకున్న మేజ‌ర్ నితిన్ గొగోల్‌ను కొంద‌రు స‌మ‌ర్థించ‌గా.. మ‌రికొంద‌రు విమ‌ర్శించారు. దీనిపై పోలీసులు ఎఫ్ఐఆర్ న‌మోదు చేయ‌డంతో ఆర్మీ విచార‌ణ‌కు ఆదేశించింది. అయితే ఈ ఘ‌ట‌న‌పై విచార‌ణ జ‌రుపుతున్న ఆర్మీ కోర్ట్ ఆఫ్ ఇంక్వైరీ మాత్రం ఆయ‌న చ‌ర్య‌ను స‌మ‌ర్థించ‌డ‌మే కాదు.. నితిన్‌పై ప్ర‌శంస‌లు కురిపించింది. ఎలాంటి గాయాలు, క్ష‌త‌గాత్రులు లేకుండా చేయ‌డానికి నితిన్ తీసుకున్న ఈ నిర్ణ‌యం ప్ర‌శంసించ‌ద‌గిన‌దే అని ఆర్మీ కోర్టు అభిప్రాయ‌ప‌డింది.

950
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles