మేజర్ గగోయ్‌పై క్రమశిక్షణా చర్యలు

Mon,August 27, 2018 01:55 PM

Army court orders disciplinary action against Major Gogoi

శ్రీనగర్: కశ్మీర్ వ్యక్తిని జీపు కట్టి ఊరిలో తిరిగి ఫేమస్ అయిన‌ మేజర్ గొగోయ్‌పై ఇప్పుడు ఆర్మీ క్రమశిక్షణా చర్యలు తీసుకున్నది. మూడు నెలల క్రితం శ్రీనగర్‌లోని ఓ హోటల్‌లో ఓ అమ్మాయితో కలిసి ఆ మేజర్ కనిపించాడు. ఆ ఘటనలో ఆర్మీ.. అతనిపై విచారణ చేపట్టింది. అయితే ఆ కేసులో ఆర్మీ కోర్టు.. మేజర్‌పై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. నిబంధనలను ఉల్లంఘించి స్థానిక అమ్మాయితో తిరిగినందుకు ఆర్మీ కోర్టు ఆ మేజర్‌ను తప్పుపట్టింది. మే 23వ తేదీన శ్రీనగర్‌లో మేజర్ గగోయ్ ఆన్‌లైన్‌లో హోటల్ రూమ్ బుక్ చేసుకున్నాడు. ఆ తర్వాత ఆ రూమ్‌కు ఓ అమ్మాయితో వచ్చాడు. దీంతో ఆ హోటల్ యజమాని మేజర్‌ను నిలదీశాడు. ఆ ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. స్థానిక అమ్మాయిని హోటల్‌కు తీసుకురావడాన్ని హోటల్ యజమాని అడ్డుకున్నాడు. ఆ తర్వాత పోలీసులు మేజర్‌పై కేసు బుక్ చేశారు. ఒకవేళ మేజర్ తప్పు చేసినా.. కఠినమైన చర్యలు తీసుకుంటామని ఆ ఘటన తర్వాత ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ కూడా స్పష్టం చేశారు.

1708
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles