ఆంధ్రా మ‌హిళ‌కి ఏఆర్ రెహ‌మాన్ కితాబు

Thu,November 15, 2018 10:34 AM

AR Rahman Utterly Impressed by andhra woman

సోష‌ల్ మీడియా ప్ర‌భావం వ‌ల‌న మారు మూలన దాగి ఉన్న ప్ర‌తిభ కూడా బ‌య‌ట‌కు వ‌స్తుంది. ఆ మ‌ధ్య‌ కేర‌ళ‌కి చెందిన ఓ కూలి విశ్వ‌రూపం చిత్రంలోని ఉన‌య్ కాన‌ధు నాన్ అనే పాట‌ని పాడగా, ఆ పాటని అతని స్నేహితుడు ఫోన్‌లో రికార్డు చేసి సోష‌ల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ పాట వైర‌ల్ కాగా, పాపుల‌ర్ గాయ‌కుడు శంక‌ర్ మ‌హ‌దేవ‌న్ కంట కూడా ప‌డింది. ఇది చూసిన శంక‌ర్‌ ఆశ్చ‌ర్య‌చ‌కితుడై అదే వీడియోని త‌న ట్విట్ట‌ర్ ద్వారా షేర్ చేస్తూ .. ఆ కూలిపై ప్ర‌శంసల‌ వర్షం కురిపించాడు. క‌మ‌ల్ అయితే ఇంటికి పిలిపించి స‌న్మానం చేశాడు. తాజాగా ఓ ఆంధ్రా మ‌హిళ పాట‌కి ఫిదా అయ్యాడు డ‌బుల్ ఆస్కార్ విన్న‌ర్ ఏఆర్ రెహ‌మాన్.

ప్ర‌భుదేవా న‌టించిన ప్రేమికుడు చిత్రంలోని ఓ చెలియా నా ప్రియ‌స‌ఖియా అనే పాట‌ని ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని వ‌డిసాలేరు ప్రాంతానికి చెందిన ఓ మ‌హిళ పాడ‌గా, ఆ వీడియో కొద్ది రోజులుగా వాట్సాప్‌లో వైర‌ల్ అయింది. రీసెంట్‌గా ఆ వీడియో ఏ ఆర్ రెహ‌మాన్ కంట ప‌డ‌గా వెంట‌నే ఫేస్ బుక్‌లో ఆ వీడియో షేర్ చేస్తూ.. ఎవ‌రో తెలియ‌ని మ‌హిళ గానం చాలా బాగుంద‌ని కామెంట్ పెట్టాడు. ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు ఓ మారు మూల గ్రామానికి చెందిన మ‌హిళ వాయిస్‌కి ఫిదా అయి సోష‌ల్‌ మీడియాలో పోస్ట్ చేయ‌డంతో ప్ర‌తి ఒక్క‌రు షాక్ అవుతున్నారు. ప్రేమికుడు చిత్రానికి ఏఆర్ రెహ‌మాన్ సంగీతం అందించ‌గా, ఇందులోని పాటలు ఇప్ప‌టికి సంగీత ప్రియుల‌ని అల‌రిస్తూనే ఉన్నాయి.

2912
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles