ఏపీకి కరువు సాయం రూ. 900.40 కోట్లు

Tue,January 29, 2019 02:47 PM

approves Central assistance of Rs 7214 crore to states affected by natural disasters

న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ కు రూ. 900.40 కోట్లు కరువు సాయం మంజూరు చేస్తూ కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిటీ నిర్ణయం తీసుకుంది. ఈ సమావేశంలో మంత్రులు పీయూష్ గోయల్, రాధామోహన్ సింగ్ పాల్గొన్నారు. 2018-19లో వరదలు, అకాల వర్షాల దృష్ట్యా కేంద్రం రాష్ర్టాలకు సహాయాన్ని ప్రకటించింది. కరువు సాయం కింద 6 రాష్ర్టాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి రూ. 7214.03 కోట్ల ఎన్డీఆర్ నిధులు విడుదల చేయాలని నిర్ణయించింది. హిమాచల్ ప్రదేశ్ కు రూ. 317.44 కోట్లు, ఉత్తరప్రదేశ్ కు రూ. 191.73 కోట్లు, గుజరాత్ కు రూ. 127.60 కోట్లు, కర్ణాటకకు రూ. 949.49 కోట్లు, మహారాష్ట్రకు రూ. 4,714.28 కోట్లు, పుదుచ్చేరికి రూ. 13.09 కోట్లు కేటాయించింది.3177
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles