పోలింగ్ బూత్ వ‌ద్ద అసెంబ్లీ స్పీక‌ర్‌పై దాడి

Thu,April 11, 2019 02:05 PM

AP speaker Kodela Siva Prasada Rao hit by voters at polling booth

హైద‌రాబాద్‌: ఆంధ్ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీ స్పీక‌ర్, టీడీపీ అభ్య‌ర్థి కోడెల శివ ప్ర‌సాద్ రావుపై ఇవాళ దాడి జ‌రిగింది. గుంటూరు జిల్లాలోని స‌త్తెన‌ప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గంలో పోలింగ్ స‌ర‌ళ‌ని ప‌రిశీలించ‌డానికి వెళ్లిన కోడెల‌పై దాడి జ‌రిగిన‌ట్లు తెలుస్తున్న‌ది. కోడెల చొక్కా చింపేశారు. ఈ దాడిని చిత్రీకరిస్తున్న మీడియా ప్రతినిధుల ఫోన్లు లాక్కొని చితకబాదారు. ప్ర‌త్య‌ర్థులు చేసిన‌ దాడిలో కోడెల సొమ్మసిల్లి పడిపోయారు. దాడి అనంతరం కోడెలను అక్కడి నుంచి తరలించారు. కోడెల‌తో పాటు ఆయ‌న గ‌న్‌మెన్‌పైన వైఎస్ఆర్ కార్య‌క‌ర్త‌లు దాడి చేసిన‌ట్లు అనుమానిస్తున్నారు. అయితే పోలింగ్ బూత్‌లో కూర్చున్న కోడెల బ‌య‌టికి వెళ్లాలంటూ ఓట‌ర్లు డిమాండ్ చేశార‌ని, దాంతో అక్క‌డ గొడ‌వ మొద‌లైన‌ట్లు కొన్ని ఆరోప‌ణ‌లు ఉన్నాయి.4389
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles