ఏపీ ప్రభుత్వ విప్‌లుగా మరో ముగ్గురికి అవకాశం

Wed,June 12, 2019 10:53 AM

Ap Govt Whips 8 members and chief Whip is MLA Srikanth Reddy

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్‌లుగా మరో ముగ్గురికి అవకాశం దక్కింది. ఇప్పటికే ఐదుగురు విప్‌లు ఉండగా.. ఈ ముగ్గురితో కలిసి విప్‌ల సంఖ్య 8కి చేరింది. ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్‌గా రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి నియామకమైన సంగతి తెలిసిందే. విప్‌లుగా ఎమ్మెల్యే బూడి ముత్యాల నాయుడు(మాడుగుల), ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు(రైల్వే కోడూరు), ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా(తుని), ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి(చంద్రగిరి) ఇదివరకే నియామకం అయ్యారు. ఇప్పుడు వీరికి అదనంగా ఎమ్మెల్యే సామినేని ఉదయభాను(జగ్గయ్యపేట), ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి(రాయదుర్గం), ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి(మాచర్ల)లకు అవకాశం దక్కింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

2186
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles