ఇది మీ ప్రభుత్వం అని గుర్తు పెట్టుకోండి!

Sun,August 18, 2019 03:50 PM

AP CM YS Jagan   Speech in Dallas Convention

డల్లాస్‌: అమెరికా పర్యటనలో ఉన్న ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి డల్లాస్‌లో ప్రవాసాంధ్రులనుద్దేశించి ప్రసంగించారు. జగన్‌ ప్రసంగిస్తూ.. 'ఇటీవల జరిగిన ఎన్నికల్లో ప్రవాసాంధ్రులు పోషించిన పాత్ర చాలా గొప్పది. మీ ప్రేమకు సెల్యూట్‌ చేస్తున్నాను. అమెరికన్లను మించి తెలుగువారు, భారతీయులు ఎదుగుతున్న తీరు గర్వకారణం. అమెరికా అభివృద్ధి వెనుక తెలుగువారి కృషి ఉందని స్వయంగా అమెరికా అధ్యక్షుడే చెప్పారు. మీరు మాతృభూమిని గౌరవిస్తున్న తీరు గర్వకారణం. ఇంకెక్కడా ఇలాంటి ప్రేమాభిమానాలు చూడలేం. తెలుగువారి ఆత్మగౌరవాన్ని పెంచేలా పాలనలో విప్లవాత్మక చర్యలు చేపడతాం. తెలంగాణతో సఖ్యత సంబంధాలను కుదుర్చుకుంటున్నాం. సముద్రంలోకి పోతున్న గోదావరి జలాలను కృష్ణాకు తీసుకొచ్చేందుకు శ్రీకారం చుట్టామని' వివరించారు.

'మన ఆంధ్రప్రదేశ్‌కు మిమ్మల్ని అందర్నీ ఆహ్వానిస్తున్నా. ఇది మీ ప్రభుత్వం అని గుర్తు పెట్టుకోండి. ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ప్రతి మనిషి, ప్రతి కుటుంబం ప్రతి సామాజిక వర్గ గౌరవాన్ని పెంచేలా నిర్ణయాలు తీసుకుంటాం. పల్లెలు, కళకళలాడాలని, మంచి చదువులు ఉండాలన్నది నా డ్రీమ్‌. వైద్యం ఖర్చు భరించలేక చనిపోయే పరిస్థితి ఎప్పటికీ రాకూడదు. కులాలు, మతాలు, వర్గాలు, ప్రాంతాలు, రాజకీయాలకు తావులేకుండా వివక్షలేని పరిపాలన అందించాలన్నది నా డ్రీమ్‌. రెండున్నర నెలల పాలనలోనే ఏకంగా చరిత్రను మార్చే దిశగా అడుగులు వేస్తాం. తొలి అసెంబ్లీ సమావేశాల్లో 19 బిల్లులను తీసుకువచ్చామని' జగన్‌ పేర్కొన్నారు.

1573
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles