మంత్రులకు శాఖలు కేటాయించిన జగన్.. హోం శాఖ ఎవరికంటే..!

Sat,June 8, 2019 04:53 PM

ap cabinet ministers and their portfolios

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి మంత్రివర్గంలో పదవీ స్వీకార ప్రమాణం చేసిన మంత్రులందరికీ శాఖలు కేటాయించారు. మొత్తం 25 మంది మంత్రులతో ఏపీ కేబినెట్‌ను శనివారం ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి జగన్ మంత్రుల శాఖలను ఖరారు చేస్తూ గవర్నర్ నరసింహన్‌కు పంపగా ఆయన ఆమోదముద్ర వేశారు. ఇందులో ఐదుగురు మంత్రులకు డిప్యూటీ సీఎం హోదా ఇచ్చారు. ఆళ్ల నాని, అంజాద్ భాషా, నారాయణస్వామి, పిల్లి సుభాష్‌చంద్రబోస్, పుష్ప శ్రీవాణిలకు ఉపముఖ్యమంత్రి హోదా కల్పించారు. అనూహ్యంగా మేకతోటి సుచరితకు హోంశాఖను అప్పగించడం విశేషం.

మంత్రులకు కేటాయించిన శాఖలు

షేక్‌ అంజాద్‌ బాషా - మైనార్టీ సంక్షేమం (డిప్యూటీ సీఎం)
పాముల పుష్పశ్రీవాణి- గిరిజన సంక్షేమ శాఖ (డిప్యూటీ సీఎం)
పిల్లి సుభాష్‌చంద్రబోస్‌- రెవెన్యూ, రిజిస్ట్రేషన్‌, స్టాంపులు (డిప్యూటీ సీఎం)
ఆళ్ల నాని- వైద్య, ఆరోగ్యం (డిప్యూటీ సీఎం)
నారాయణ స్వామి-ఎక్సైజ్‌, వాణిజ్య పన్నులు(డిప్యూటీ సీఎం)

మేకతోటి సుచరిత- హోంశాఖ, విపత్తు నిర్వహణ
బొత్స సత్యనారాయణ- మున్సిపల్‌, పట్టణాభివృద్ధి శాఖ
అవంతి శ్రీనివాస్‌- పర్యాటక శాఖ
కురసాల కన్నబాబు- వ్యవసాయం
ఆదిమూలపు సురేశ్‌- విద్యా శాఖ

పినిపే విశ్వపరూప్‌- సాంఘిక సంక్షేమం
చెరుకువాడ శ్రీరంగనాథరాజు- గృహ నిర్మాణం
తానేటి వనిత- మహిళా సంక్షేమం
కొడాలి నాని- పౌర సరఫరా, వినియోగదారుల శాఖ
పేర్ని నాని- రవాణా, సమాచార శాఖ

పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి- పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, గనులు
వెల్లంపల్లి శ్రీనివాస్‌- దేవాదాయ
ధర్మాన కృష్ణదాస్‌- రోడ్లు, భవనాలు
మోపిదేవి వెంకటరమణ- పశు సంవర్థకం, మత్స్య, మార్కెటింగ్‌
బాలినేని శ్రీనివాస్‌రెడ్డి- అటవీ, పర్యావరణం, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ

అనిల్‌కుమార్‌ యాదవ్‌- జలవనరుల శాఖ
మేకపాటి గౌతమ్‌రెడ్డి- పరిశ్రమలు, వాణిజ్యం
బుగ్గన రాజేంద్రనాథ్‌- ఆర్థిక, ప్రణాళిక, అసెంబ్లీ వ్యవహరాలు
గుమ్మునూరు జయరామ్‌- కార్మిక, ఉపాధి శిక్షణ
మాలగుండ్ల శంకర్‌ నారాయణ- బీసీ సంక్షేమం

6937
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles