అక్టోబర్ 2 నుంచి అన్నా ఆమరణ నిరాహార దీక్ష!

Sat,September 29, 2018 11:36 AM

Anna Hazare takes hunger strike from October 2

న్యూఢిల్లీ : అవినీతి నిర్మూలన లక్ష్యంగా ఉద్యమిస్తున్న సామాజిక కార్యకర్త అన్నా హజారే మరోసారి ఆమరణ నిరాహార దీక్ష చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. కేంద్రంలో లోక్‌పాల్, రాష్ర్టాల్లో లోకాయుక్త తీసుకురావాలన్న డిమాండ్‌పై అక్టోబర్ 2 నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని అన్నా హజారే ప్రకటించారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీకి హజారే లేఖ రాశారు. సమర్థవంతమైన లోక్‌పాల్‌ను తీసుకురావడంలో మోదీ సర్కార్ విఫలమైందని ఆయన నిప్పులు చెరిగారు. లోక్‌పాల్, లోకాయుక్త ఏర్పాటు విషయంలో గడిచిన నాలుగేళ్లు హామీలకు పరిమితమైందని అన్నా హజారే విమర్శించారు. కేంద్రంలో లోక్‌పాల్, రాష్ట్రాల్లో లోకాయుక్త తీసుకురావాలన్న డిమాండ్‌పై ఈ ఏడాది మార్చిలో ఢిల్లీలోని చరిత్రాత్మక రామ్ లీలా మైదానంలో అన్నా హజారే నిరవధిక నిరాహార దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే.

1801
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles