రివర్స్ టెండరింగ్‌తో ఖజానాకు ఆదాయం..!

Sat,August 17, 2019 07:10 PM

Anil Kumar Yadav Over Reverse Tendering

అమరావతి: పోలవరం రివర్స్ టెండరింగ్‌పై ఏపీ మంత్రి అనిల్ కుమార్ స్పందించారు. ఈ సందర్భంగా మంత్రి అనిల్ మాట్లాడుతూ.. 'పీపీఏ సీఈవో అభిప్రాయాలపై స్పష్టతనిస్తాం. టెండర్ల రద్దుతో ఎక్కువ భారం పడుతుందని పీపీఏ చెబుతోంది. రివర్స్ టెండరింగ్‌తో ఖజానాకు ఆదాయం. గతంలో ఇచ్చిన నామినేషన్‌ల పద్ధతి సరైంది కాదని రద్దు చేశాం. నవంబర్ 1 నుంచి పనులు తిరిగి ప్రారంభమవుతాయి. గత ప్రభుత్వంలో జరిగిన తప్పిదాలు బయటపడుతున్నాయి. కృష్ణాలో నీరు చూసి చంద్రబాబుకు కడుపు మండుతోంది. ఎన్నికల షాక్‌తో చంద్రబాబుకు మైండ్ సరిగా పనిచేయట్లేదు. తండ్రీకొడుకులు ఏం మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదని' అనిల్ విమర్శించారు. పోలవరం టెండర్లలో రూ.3,600కోట్ల మేర అంచనాలు పెరిగాయని నిపుణుల కమిటీ తేల్చింది. కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా రివర్స్ టెండరింగ్‌కు నోటిఫికేషన్ జారీ చేశారు.

1085
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles