జైలుశిక్ష నుంచి తప్పించుకున్న అనిల్ అంబానీ

Mon,March 18, 2019 06:43 PM

Anil Ambanis RCom Pays Rs. 462 Crore Dues Before Top Court Deadline Ends

ముంబై: రిలయన్స్ కమ్యూనికేషన్స్(ఆర్‌కామ్) అధినేత అనిల్ అంబానీ జైలుకు వెళ్లకుండా తప్పించుకున్నాడు. స్వీడన్ టెలికాం కంపెనీ ఎరిక్సన్ బకాయిల చెల్లింపు వ్యవహారంలో ఉత్కంఠకు తెరపడిపోయింది. ఎరిక్సన్ బకాయిలు చెల్లించడానికి(మార్చి 19,2019) ఆర్‌కామ్‌కు ఒక్కరోజు మాత్రమే గడువు మిగిలి ఉండగా.. తాజాగా ఆ సంస్థకు చెల్లించాల్సిన మొత్తాన్ని ఆర్‌కామ్ పూర్తిగా చెల్లించింది. ఈ విషయాన్ని ఎరిక్సన్ ప్రతినిధి ఒకరు అధికారికంగా వెల్లడించారు. రూ.462కోట్ల బకాయిలను రిలయన్స్ సంస్థ తమ ఖాతాలో జమచేసినట్లు కంపెనీ ప్రతినిధి చెప్పారు.

ఎరిక్సన్‌కు రూ. 550 కోట్ల బకాయిలను నాలుగు వారాల్లో చెల్లించాలని గత నెల సుప్రీం కోర్టు ఆర్‌కామ్‌ను ఆదేశించిన విషయం తెలిసిందే. లేనిపక్షంలో జైలుశిక్ష తప్పదని అనిల్ అంబానీని హెచ్చరించిన సంగతీ విదితమే. అయితే ఇప్పటికే రూ.118 కోట్లు చెల్లించింది.

4898
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles