సుప్రీంకోర్టుకు అనిల్ అంబానీ

Tue,February 12, 2019 10:50 AM

న్యూఢిల్లీ: రిల‌య‌న్స్ క‌మ్యూనికేష‌న్ చైర్మ‌న్ అనిల్ అంబానీ ఇవాళ సుప్రంకోర్టుకు వ‌చ్చారు. ఎరిక్స‌న్ ఇండియా వేసిన కేసులో ఆయ‌న కోర్టు ముందు విచార‌ణ‌కు హాజ‌ర‌య్యారు. రిల‌య‌న్స్ జియో కోసం ఎరిక్స‌న్ ఇండియా కొన్ని ఆస్తులను అమ్మేసింది. ఆ ఒప్పందం ప్ర‌కారం రిల‌య‌న్స్ సంస్థ సుమారు 550 కోట్లు చెల్లించాల్సి ఉంది. అయితే ఆ బిల్లు ఇంకా క్లియ‌ర్ కాలేదు. త‌మ బాకీలు క్లియ‌ర్ చేయాలంటూ ఎరిక్స‌న్ ఇండియా కోర్టును ఆశ్ర‌యించింది. ఆ కేసులో ఇవాళ సుప్రీం ముంద‌కు అనిల్ అంబానీ హాజ‌రు కావాల్సి వ‌చ్చింది. జస్టిస్‌ ఆర్ఎఫ్ నారీమ‌న్ నేతృత్వంలోని ధ‌ర్మాస‌నం.. గ‌త విచార‌ణ స‌మ‌యంలో అనిల్‌కు స‌మ‌న్లు జారీ చేసింది.

922
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles