మోదీ అవినీతిప‌రుడు.. అనిల్ అంబానీకి మ‌ధ్య‌వ‌ర్తి

Tue,February 12, 2019 12:04 PM

న్యూఢిల్లీ : రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలుపై ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీ మ‌రికొన్ని విష‌యాలు వెల్ల‌డించారు. రాఫెల్ ఒప్పందంలో ప్ర‌ధాని మోదీ అవినీతికి పాల్ప‌డిన‌ట్లు ఆయ‌న ఆరోపించారు. అనిల్ అంబానీకి మ‌ధ్య‌వ‌ర్తిగా ప్ర‌ధాని మోదీ ప‌నిచేశార‌ని తెలిపారు. ఫ్రాన్స్ ర‌క్ష‌ణ మంత్రితో అనిల్ అంబానీ భేటీ అయిన‌ట్లు ఆయ‌న చెప్పారు. రాఫెల్ ఒప్పందంలో త‌న స్నేహితుడు అనిల్ అంబానీకి ప్ర‌ధాని మోదీ హెల్ప్ చేశార‌ని రాహుల్ విమ‌ర్శించారు. దేశ ప్ర‌జ‌ల‌కు చెందిన సుమారు 30 వేల కోట్ల డ‌బ్బును మోదీ దొంగ‌లించార‌ని ఆరోపించారు. ఇప్ప‌టికే రాఫెల్ డీల్‌పై ఆంగ్ల దిన ప‌త్రిక ద హిందూ కొన్ని సంచ‌ల‌నాత్మ‌క అంశాల‌ను వెల్ల‌డించిన విష‌యం తెలిసిందే. ఫ్రాన్స్‌తో రాఫెల్ ఒప్పందంపై పీఎంవో దొడ్డిదారిలో చ‌ర్చ‌లు జ‌రిపిన‌ట్లు ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. అంతేకాకుండా ఆ ఒప్పందం కోసం కొన్ని నిబంధ‌న‌ల‌ను కూడా తుంగ‌లో తొక్కేశారు.ఈ నేప‌థ్యంలో రాహుల్ మ‌రికొన్ని రాఫెల్ ర‌హ‌స్యాల‌ను వెల్ల‌డించే ప్ర‌య‌త్నం చేశారు. రాఫెల్ డీల్‌కు ముందు అనిల్ మినిస్ట‌ర్స్ ఆఫీసుకు వెళ్లార‌ని, ఒప్పంద ప‌త్రం త‌యారీలో ఉన్న‌ద‌ని, ప్ర‌ధాని విజిట్ చేసే స‌మ‌యంలో దానిపై సంత‌కాలు జ‌రుగుతాయ‌ని కూడా ఆ మెయిల్‌లో ఉంది. ప్ర‌ధాని మోదీ విజిట్ క‌న్నా ముందే.. అనిల్ అంబానీ ఎలా ఫ్రాన్స్ ర‌క్ష‌ణ‌మంత్రితో భేటీ అవుతార‌ని రాహుల్ ప్ర‌శ్నించారు. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన ఓ ఈమెయిల్‌ను కాంగ్రెస్ నేత బ‌య‌ట‌పెట్టారు. మ‌రోవైపు ఇవాళ లోక్‌స‌భ‌లో రాఫెల్‌కు సంబంధించిన కాగ్ నివేదిక‌ను కేంద్ర ప్ర‌భుత్వం స‌మ‌ర్పించ‌నున్న‌ది.

1424
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles