అంబానీకి పేపర్ విమానాలు తయారు చేయడం కూడా రాదు!

Tue,March 12, 2019 05:59 PM

Anil Ambani can not even make Paper Planes says Rahul Gandhi in Gandhinagar

గాంధీనగర్: రాఫెల్ ఫైట‌ర్‌ జెట్స్ డీల్‌పై ప్రధాని మోదీ లక్ష్యంగా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తన విమర్శలను కొనసాగిస్తున్నారు. మంగళవారం గుజరాత్‌లో సీడబ్ల్యూసీ సమావేశంతో తర్వాత జరిగిన సభలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా మరోసారి మోదీ, అనిల్ అంబానీలపై విమర్శలు గుప్పించారు. ఈ రాఫెల్ డీల్ ద్వారా రూ.30 వేల కోట్లను తన ఫ్రెండ్ అనిల్ అంబానీకి మోదీ దోచి పెట్టారని ఆరోపించారు. మోదీ మన ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌ను ప్రశంసిస్తారు. కానీ వాళ్ల జేబుల్లో నుంచే రూ.30 వేల కోట్లు దోచుకొని అనిల్ అంబానీకి ఇచ్చినట్లు మాత్రం చెప్పారు అని రాహుల్ అన్నారు. అనిల్ అంబానీకి చెందిన రిలయెన్స్ డిఫెన్స్ ఎప్పుడూ విమానాన్ని తయారు చేయలేదని రాహుల్ చెప్పారు. అంతేకాదు.. అసలు అనిల్ అంబానీకి పేపర్ విమానం కూడా తయారు చేయడం రాదని నేను గట్టిగా చెప్పగలను అని ఆయన అనడం విశేషం. మోదీ వెంటే అనిల్ అంబానీ కూడా ఫ్రాన్స్ వెళ్లారని, ఆయనకే కాంట్రాక్ట్ ఇవ్వాల్సిందిగా మోదీ తనకు సూచించినట్లు ఫ్రాన్స్ అధ్యక్షుడు చెప్పారని రాహుల్ అన్నారు.

1696
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles