టీచర్‌ను బట్టలూడదీసి ఊరేగించారు..

Wed,August 22, 2018 08:31 AM

అమరావతి : విద్యార్థినులకు విద్యాబుద్ధులు నేర్పించి.. వారిని ప్రయోజకులుగా తీర్చిదిద్దాల్సింది పోయి.. కీచకుడిగా మారాడు ఓ ఉపాధ్యాయుడు. నిత్యం విద్యార్థినులను లైంగికంగా వేధిస్తున్న టీచర్‌ను బట్టలూడదీసి ఊరేగించారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులోని ఓ పాఠశాలలో రాంబాబు(40) అనే వ్యక్తి ఇంగ్లీష్ టీచర్‌గా పని చేస్తున్నాడు. అయితే గత రెండేళ్ల నుంచి పలువురు విద్యార్థినులను లైంగికంగా వేధిస్తున్నాడు.


ఓ విద్యార్థిని తన గదికి పిలిపించుకొని పలుమార్లు అత్యాచారం చేశాడు. ఆ విద్యార్థిని గర్భం కూడా దాల్చింది. ఐదో నెల వచ్చేసరికి గర్భం పోవడానికి బుద్ధిలేని ఉపాధ్యాయుడు మెడిసిన్స్ కూడా ఇచ్చాడు. దీంతో బాధిత విద్యార్థినికి తీవ్ర రక్తస్రావం కావడంతో.. ఆమెను తల్లిదండ్రులు ప్రశ్నించారు. బోరున విలపిస్తూ జరిగిన విషయాన్ని విద్యార్థిని తల్లిదండ్రులకు చెప్పింది. స్థానికులంతా కలిసి రాంబాబును తీవ్రంగా చితకబాది.. బట్టలూడదీసి ఏలూరు వీధుల్లో ఊరేగించారు. కీచక టీచర్ రాంబాబుపై బాధితురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు రాంబాబును అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

5828
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles