ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన ఈ ఫన్నీ వీడియోలు చూడండి.. నవ్వకుండా ఉండలేరు..!

Wed,March 20, 2019 03:42 PM

ప్రముఖ వ్యాపారవేత్త, మహీంద్రా కంపెనీస్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో కాస్త యాక్టివ్‌గానే ఉంటారు. సోషల్ మీడియాలో చాలా సరదాగా ఉంటారాయన. ఫన్నీ వీడియోలు, ఫన్నీ ఫోటోలు షేర్ చేస్తూ నెటిజన్లను నవ్విస్తుంటారు. ట్విట్టర్‌లో వాట్సప్‌వండర్‌బాక్స్ హాష్‌టాగ్ పేరుతో షేర్ అయ్యే ఫన్నీ ట్వీట్లకు ఆనంద్ అప్పుడప్పుడు రెస్పాండ్ అవుతుంటారు.


తాజాగా లాజిక్‌కు అందని ఇంగ్లీష్ పదాల స్పెల్లింగ్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. దానికి సంబంధించిన ఓ వీడియోను ఆనంద్ మహీంద్రా షేర్ చేశారు. ఇది ఫన్నీగానే ఉంది. కాకపోతే ఇది ఇండియన్స్‌ను కొంచెం తక్కువగా అంచన వేసేదిలా ఉంది అంటూ ట్వీట్ చేశారు.
అయితే.. ఇవి కామెడీ కోసం చేసిన వీడియోలని.. సోషల్ మీడియాలో ఫన్ జెనరేట్ చేయడం కోసం రూపొందించిన వీడియోలని కొంతమంది నెటిజన్లు కామెంట్ చేశారు. అవే కాదు.. దానికి సంబంధించిన మరికొన్ని వీడియోలను కూడా నెటిజన్లు సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ వీడియోలు కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
3055
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles