ట్రెండింగ్‌లో అమృత్‌సర్ హాష్‌టాగ్.. ఏం జ‌రిగిందంటే?

Fri,March 15, 2019 01:07 PM

Amritsar Trends On Twitter After Users Say They Heard Loud Sounds

ప్రపంచంలోని ఏ మూలనైనా చీమ చిటుక్కుమన్నా చాలు.. ముందు సోషల్ మీడియా ఉలిక్కిపడుతుంది. అసలేం జరిగింది. అక్కడ చీమ చిటుక్కుమని ఎందుకన్నది.. అంటూ సోషల్ మీడియాలో కథనాల మీద కథనాలు రూపొందుతాయి. దానికి హాష్‌టాగ్‌లు, ట్రెండింగ్‌లు, యూట్యూబ్ వీడియోలు, డిబేట్‌లు.. ఇలా సోషల్ మీడియా అంతా ఆరోజు చీమ చిటుక్కుమనడంపైనే చర్చిస్తుంది. ఇది ఈరోజుల్లో కామన్. సేమ్ టు సేమ్ ఇటువంటి ఘటనే ఒకటి పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో చోటు చేసుకున్నది.

గ‌త‌ రాత్రి 1 గంట ప్రాంతంలో అమృత్‌సర్‌లో ఆకాశంలో పెద్ద శబ్దం వినిపించింది. ఒకసారి కాదు ఆ పెద్ద శబ్దం రెండు సార్లు వినిపించిందట. దీంతో నిద్రలో ఉన్న అమృత్‌సర్ జనాలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అసలేం జరిగిందా అని ఆరా తీశారు. వెంటనే ట్విట్టర్‌లో అమృత్‌సర్ హాష్‌టాగ్‌ను ట్రెండింగ్ చేయడం ప్రారంభించారు. ఆ హాష్‌టాగ్‌తో ఆ పెద్ద శబ్దం ఏంటి. ఎందుకు అంత అర్ధరాత్రి వినిపించింది. ఇది ఎవరి పని.. ఇలా ఎవరికి తోచింది వాళ్లు ట్విట్టర్‌లో షేర్ చేయడం ప్రారంభించారు.

ట్విట్టర్ స్టోరీల ప్రకారం.. ఆకాశంలో రెండు ఎయిర్ ఫోర్స్ జెట్స్ నుంచి సోనిక్ బూమ్స్ సౌండ్స్ వినిపించాయట. సోనిక్ బూమ్ అంటే సాధారణ స్పీడ్ కంటే ఎక్కువ స్పీడ్ వెళ్లినప్పుడు జెట్ నుంచి వచ్చే శబ్దం అన్నమాట. అది వాటి శబ్దమే అంటూ కొంతమంది ట్వీట్లు చేశారు.

ఈ ఘటనపై స్పందించిన అమృత్‌సర్ ఏడీసీపీ.. జగ్జిత్ సింగ్ వాలియా సోషల్ మీడియాలో వచ్చే రూమర్స్ నమ్మొద్దన్నారు. ప్రస్తుతం అంతా ఓకే. అమృత్‌సర్‌కు ఎటువంటి హానీ లేదు. మాకు వచ్చిన సమాచారం ప్రకారం అదంతా పుకారు.. అని ఆయన తెలిపారు.

అమృత్‌సర్ ప్రజలు ఈ ఘటనపై ట్విట్టర్‌లో ఎలా స్పందించారో మీరే చదవండి...


2214
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles