ఎయిమ్స్‌లో ఫ్లోర్ ఊడ్చిన షా, న‌డ్డా

Sat,September 14, 2019 09:29 AM

Amith Shah, JP Nadda sweeps floor in AIIMS as part of the partys Seva Saptah campaign

హైద‌రాబాద్‌: ఈనెల 17వ తేదీన ప్ర‌ధాని మోదీ జ‌న్మ‌దినం. ఈ నేప‌థ్యంలో బీజేపీ పార్టీ దేశ‌వ్యాప్తంగా సేవా స‌ప్తాహ్ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హిస్తోంది. దీనిలో భాగంగా ఇవాళ కేంద్ర మంత్రి అమిత్ షా, బీజేపీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ న‌డ్డాలు.. ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్ప‌త్రిలో ఉన్న ఓ ఫ్లోర్‌ను ఊడ్చారు. సేవా స‌ప్తాహ్‌లో భాగంగా హాస్ప‌ట‌ల్‌ను శుభ్రం చేసే కార్య‌క్ర‌మంలో పాల్గొన్న‌ట్లు షా తెలిపారు. దేశ సేవ కోస‌మే ప్ర‌ధాని మోదీ త‌న జీవితాన్ని త్యాగం చేశార‌ని, ఆయ‌న పేద‌ల కోస‌మే ప‌నిచేశార‌ని షా అన్నారు. అందుకే మోదీ బ‌ర్త్‌డే సెల‌బ్రేష‌న్స్‌ను.. సేవా స‌ప్తాహ్ పేరుతో నిర్వ‌హించ‌నున్న‌ట్లు అమిత్ షా చెప్పారు. అంత‌క‌ముదు హాస్ప‌ట‌ల్లో చిన్న‌పిల్ల‌లు చికిత్స‌పొందే వార్డుకు వెళ్లిన షా.. అక్క‌డ‌ వారికి పండ్లు పంపిణీ చేశారు.1015
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles