2 వేల మంది రైతుల అప్పు తీర్చిన అమితాబ్‌

Wed,June 12, 2019 03:25 PM

Amitabh Bachchan Pays Off Loans Of 2,100 Farmers From Bihar

ముంబయి: రెండు వేల మందికి పైగా రైతుల అప్పులను బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ తీర్చేశారు. ఈ రైతులంతా బిహార్‌కు చెందినవారు. బిహార్‌కు చెందిన మొత్తం రుణగ్రహీత రైతుల్లో తిరిగి చెల్లించలేని స్థితిలో ఉన్న 2100 మంది రైతులను ఎన్నుకోని వారి రుణాలను అమితాబ్‌ బ్యాంకులకు వన్‌టైం సెటిల్‌మెంట్‌ కింద క్లియర్‌ చేశారు. కూతురు స్వేతా బచ్చన్‌, కొడుకు అబిషేక్‌ బచ్చన్‌ చేతుల మీదుగా బాధిత రైతులకు అమితాబ్‌ సాయం చేశారు. ఈ మేరకు ఇచ్చిన హామీని అమితాబ్‌ అమలు పరిచారు. రైతుల రుణాలను చెల్లించడం అమితాబ్‌కు ఇదే మొదటిసారి కాదు. గతేడాది ఉత్తరప్రదేశ్‌కు చెందిన వెయ్యి మంది రైతుల రుణాలను చెల్లించారు. అమితాబ్‌ తన బ్లాగ్‌లో ఇలా రాసుకున్నారు. మరో వాగ్దానం నెరవేర్చాల్సి ఉంది. దేశం కోసం పుల్వామా దాడిలో మృతిచెందిన అమరవీరుల కుటుంబ సభ్యులను, వారి భార్యలను ఆదుకోవాల్సి ఉందన్నారు.


2678
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles