క్విక్ రెస్పాన్స్ టీమ్.. 24 గంటలు ముంబైని కంటికి రెప్పలా కాపాడుతుంది: అమితాబ్

Fri,February 22, 2019 06:52 PM

Amitabh Bachchan Introduces Mumbai Police Quick Response Team

ముంబై.. భారత దేశ వాణిజ్య నగరం. ఉగ్రవాదుల హిట్ లిస్ట్‌లో మొదటి స్థానంలో ఉండే సిటీ. అందుకే.. ముంబై పోలీసులు ఎప్పుడూ అలర్ట్‌గా ఉంటారు. ముంబైని కంటికి రెప్పలా కాపాడటానికి శాయశక్తులా ప్రయత్నిస్తుంటారు. అయినప్పటికీ.. గ‌తంలో ముంబైలో కొన్ని ఉగ్రదాడులు చోటు చేసుకున్నాయి. వందల మంది ఉగ్రవాదుల తూటాలకు ప్రాణాలొదిలారు. అందుకే.. ఇకముందు ముంబైలో ఉగ్రదాడి జరగకుండా ఉండేందుకు ముంబై పోలీసులు క్విక్ రెస్పాన్స్ టీమ్‌ను తయారు చేశారు. ఈ టీమ్‌ను ముంబైకి, ఈ దేశానికి బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ పరిచయం చేశారు.ముంబైని 24 గంటలు కంటికి రెప్పలా కాపాడే టీమ్ క్విక్ రెస్పాన్స్ టీమ్ అని.. సిటీలో ఎటువంటి అసాధారణ పరిస్థితులు ఉన్నా.. వెంటనే అక్కడికి ఈ టీమ్ చేరుకుంటుందని.. పరిస్థితులను అదుపులోకి తీసుకొస్తుందని అమితాబ్ వీడియోలో పేర్కొన్నారు. ఆ వీడియోలో క్విక్ రెస్పాన్స్ టీమ్ మాక్ డ్రిల్‌ను కూడా చూడొచ్చు. డైరెక్టర్ అలీ అబ్బాస్ జఫర డైరెక్ట్ చేసిన ఈ వీడియోను యష్ రాజ్ ఫిలింస్ ప్రొడ్యూస్ చేసింది. ఈ వీడియోను ముంబై పోలీస్ తన ట్విట్టర్ అకౌంట్‌లో షేర్ చేయడంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్లు కూడా క్విక్ రెస్పాన్స్ టీమ్‌పై, ఆ టీమ్ గురించి ప్రపంచానికి తెలియజేసిన బిగ్‌బీని, ముంబై పోలీసులను ప్రశంసిస్తున్నారు.2697
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles