బీజేపీ జాతీయ అధ్యక్షుడు ఎవరు?

Thu,June 13, 2019 10:49 AM

Amit Shah To Remain BJP Chief For Now Say Sources

హైదరాబాద్‌ : భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా.. కేంద్ర హోంమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో ఆయన వారసుడి కోసం బీజేపీ కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలో బీజేపీ కొత్త అధ్యక్షుడి ఎంపిక కోసం ఆ పార్టీ చర్యలు చేపట్టింది. బీజేపీ కొత్త అధ్యక్షుడి ఎంపికపై అన్ని రాష్ర్టాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులతో అమిత్‌ షా సమావేశమై ఇవాళ చర్చించనున్నారు. అయితే అమిత్‌ షానే మరో ఆరు నెలల పాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా కొనసాగుతారని తెలుస్తోంది. బీజేపీ పాలిత రాష్ర్టాలైన హర్యానా, జార్ఖండ్‌, మహారాష్ట్ర శాసనసభలకు త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అమిత్‌ షానే మరో ఆరు నెలల పాటు కొనసాగుతారని వార్తలు వినిపిస్తున్నాయి. అమిత్‌ షానే అధ్యక్షుడిగా కొనసాగుతారా? లేక ఎవరినైనా నియమిస్తారా? అన్నది ఇవాళ సమావేశంలో స్పష్టత రానుంది. అయితే బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా జగత్‌ ప్రకాశ్‌ నడ్డాను నియమిస్తారని వార్తలు షికారు చేస్తున్న విషయం తెలిసిందే. అమిత్‌ షా వ్యూహాంతో ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ 303 ఎంపీ స్థానాలను గెలుచుకుంది.

1402
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles