ఎన్డీయే మిత్ర‌ప‌క్షాల‌కు అమిత్ షా విందు

Mon,May 20, 2019 01:11 PM

Amit Shah to host dinner for NDA leaders on Tuesday

హైద‌రాబాద్‌: ఎన్డీయేనే మ‌ళ్లీ అధికారం చేప‌డుతుంద‌ని ఎగ్జిట్‌పోల్స్ హోరెత్తించిన విష‌యం తెలిసిందే. అయితే ఫుల్ ఖుషీలో ఉన్న ఎన్డీయే మిత్ర‌ప‌క్షాల‌కు.. బీజేపీ అధ్య‌క్షుడు అమిత్ షా విందు ఏర్పాటు చేశారు. మంగ‌ళ‌వారం ఢిల్లీలో జరిగే ఈ కార్య‌క్ర‌మానికి కేంద్ర మంత్రులు కూడా హాజ‌రుకానున్నారు. లోక్‌స‌భ ఎన్నిక‌ల ఫ‌లితాలు ఈనెల 23న వెలుబ‌డ‌నున్నాయి. ఎక్కువ‌శాతం ఎగ్జిట్‌పోల్స్ ఎన్డీయే కూట‌మికి 300 సీట్లు దాటుతాయ‌ని అంచ‌నా వేశాయి. న్యూస్‌24 చాణ‌క్య స‌ర్వే ప్ర‌కారం ఎన్డీయేకు 350 సీట్లు రానున్నాయి. ఆజ్‌త‌క్‌-ఇండియా టుడే ప్ర‌కారం 339 నుంచి 365 సీట్లు రానున్నాయి. న్యూస్‌18 ప్ర‌కారం 336 సీట్లు వ‌స్తున్నాయి.

1372
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles