టార్గెట్ 2019: కపిల్‌దేవ్‌ను కలిసిన అమిత్ షా

Sat,June 2, 2018 02:37 PM

Amit Shah meets Kapil Dev, family as part of BJPs 2019 outreach


న్యూఢిల్లీ: దేశంలోని వివిధ రంగాల ప్రముఖులను కలిసి ఎన్డీఏ సర్కారు సాధించిన విజయాల గురించి వివరించాలని బీజేపీ నిర్ణయించిన విషయం తెలిసిందే. 'సంపర్క్ ఫర్ సమర్ధన్' కార్యక్రమంలో భాగంగా బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా శుక్రవారం దక్షిణ ఢిల్లీలోని లెజండరీ క్రికెటర్ కపిల్ దేవ్ నివాసానికి వెళ్లారు. గత నాలుగేళ్లలో నరేంద్ర మోదీ ప్రభుత్వం సాధించిన విజయాలతో రూపొందించిన పుస్తకాన్ని కపిల్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులకు అమిత్ షా అందజేశారు. వారితో కాసేపు పలు అంశాలపై చర్చించారు.

అంతకుముందు మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ దల్బీర్ సింగ్ సుహాగ్, మాజీ లోక్‌సభ సెక్రటరీ జనరల్ సుభాష్ కశ్యప్‌ల నివాసాలకు వెళ్లి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ ప్రచార కార్యక్రమంలో భాగంగా అమిత్ షా దేశవ్యాప్తంగా ఉన్న 50 మంది మేధావులను కలిసి బుక్‌లెట్‌ను అందజేయనున్నారు. 2019 లోక్‌సభ సాధారణ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని బీజేపీ వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇదే తరహాలో కేంద్రమంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు ఈ పుస్తకాన్ని వేలాది మందికి ఇవ్వనున్నారు.3321
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles