టీఎం కృష్ణ క‌ర్నాట‌క క‌చేరి రేపే

Fri,November 16, 2018 04:48 PM

Amid threats, Carnatic singer TM Krishna to perform in Delhi tomorrow

న్యూఢిల్లీ : క‌ర్నాట‌క సంగీత క‌ళాకారుడు టీఎం కృష్ణ‌.. రేపు ఢిల్లీలో త‌న క‌చేరి ప్ర‌ద‌ర్శ‌న ఇవ్వ‌నున్నారు. వాస్త‌వానికి సంగీత ప్ర‌ద‌ర్శ‌న చేయ‌రాదు అంటూ కృష్ణ‌కు బెదిరింపులు వ‌చ్చాయి. కానీ ఢిల్లీ ప్ర‌భుత్వం చొర‌వ తీసుకోవ‌డంతో.. శ‌నివారం ఆయ‌న‌ సాకేత్‌లోని గార్డెన్ ఆఫ్ ఫైవ్ సెన్సెస్‌లో ప్ర‌ద‌ర్శ‌న ఇవ్వ‌నున్నారు. మెగ‌సేసే అవార్డు గ్ర‌హీత అయిన టీఎం కృష్ణ‌.. ఢిల్లీలో ఈనెల 17, 18వ తేదీల్లో ప్ర‌ద‌ర్శ‌న ఇవ్వ‌నున్న‌ట్లు ముందే ప్ర‌క‌టించారు. కానీ అతివాదుల నుంచి బెదిరింపులు రావ‌డంతో ఆయ‌న త‌న ప్ర‌ద‌ర్శ‌న‌ను ర‌ద్దు చేసుకున్న‌ట్లు తెలిపారు. అయితే ఢిల్లీ డిప్యూటీ సీఎం మ‌నీష్ సిసోడియా చొర‌వ తీసుకోవ‌డంతో ప్ర‌ద‌ర్శ‌న‌కు అంగీక‌రించారు. క‌ర్నాట‌క సంగీత క‌ళాకారుడైన టీఎం కృష్ణ‌.. జీసెస్‌, అల్లాపైన కూడా పాట‌లు పాడారు. దీంతో ఆ వీడియోలు ఇటీవ‌ల వ్యాట్సాప్‌లో వైర‌ల్ అయ్యాయి. ఈ నేప‌థ్యంలో అతివాదులు ఆయ‌న్ను బెదిరించారు. త‌న‌ను అర్బ‌న్ న‌క్స‌ల్‌గా గుర్తిస్తున్నార‌ని కృష్ణ ఆరోపించారు. ఏదేమైనా తాను మాత్రం ప్ర‌తి నెలా జీసెస్‌, అల్లాపై ఓ పాట‌ను క‌ర్నాట‌క బాణీలో పాడ‌నున్న‌ట్లు స్ప‌ష్టం చేశారు. రేపు జ‌రిగే క‌చేరి ఈవెంట్ కోసం ఢిల్లీలో బందోబ‌స్తు పెంచారు. చెన్నైకు చెందిన కృష్ణ ప్ర‌ముఖ క‌ళాకారుల ద‌గ్గ‌ర క‌ర్నాట‌క సంగీతాన్ని నేర్చుకున్నారు.

955
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles