ఇండియా పనికివచ్చే పని చేయడం లేదట

Fri,October 12, 2018 04:49 PM

america not happy with indian actions

ఇరాన్ బహుళపక్ష అణు ఒప్పందం నుంచి అమెరికా ఏకపక్షంగా బయటకి వచ్చింది. ఆ తర్వాత ఆంక్షలు కూడా ప్రకటించింది. ఇరాన్ నుంచి ఎవరూ చమురు కొనవద్దని పిలుపు ఇచ్చింది. కానీ భారత్ అవసరాల రీత్యా ఇరాన్ నుంచి చమురు కొనక తప్పని పరిస్థితి. కొంటున్నది కూడా. అలాగే అమెరికా ప్రధాన ప్రత్యర్థి రష్యా నుంచి ఇండియా ఎస్-400 క్షిపణులు కొంటున్నది. ఈ రెండూ పనికివచ్చే పనులు కావని అమెరికా ప్రభుత్వం పెదవి విరిచింది. నవంబర్‌లో ఇరాన్ నుంచి ముడిచమురు దిగుమతికి భారత చమురు సంస్థలు ఆర్డరు పంపాయని కేంద్ర చమురుశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రకటించారు. అమెరికా విదేశాంగశాఖ ప్రతినిధి దీనిపై స్పందిస్తూ ఇది ఏమాత్రం సహాయకారి అంశం కాదని అన్నారు. చమురు, క్షిపణుల అంశంపై అమెరికా ప్రభుత్వం సమీక్ష జరిపి నిర్ణయం తీసుకుంటుందని ప్రతినిధి సున్నితంగా హెచ్చరించారు.|


2227
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles